News March 23, 2024
ఢిల్లీపై పంజాబ్ విజయం

కొత్త హోం గ్రౌండ్‌లో పంజాబ్ తొలి మ్యాచ్‌లోనే విజయం నమోదు చేసింది. చండీగఢ్‌లోని మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. 175 రన్స్ టార్గెట్‌తో ఛేదనకు దిగిన పంజాబ్ 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.. సామ్ కరన్ (63) హాఫ్ సెంచరీతో రాణించారు. పంజాబ్ తన హోం గ్రౌండ్‌ను మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి ఇటీవల మార్చుకుంది.
Similar News
News April 21, 2025
భారీ ఎన్‌కౌంటర్.. 8 మంది మావోలు మృతి

మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. జార్ఖండ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది మావోలు మరణించారు. బొకారో జిల్లా లాల్‌పానియా వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో వివేక్ అనే కీలక మావో నేత కూడా మరణించారు. అతడిపై రూ.కోటి రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా ఘటనాస్థలంలో భద్రతా దళాలు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి.
News April 21, 2025
అథ్లెటిక్స్ జట్టు కోచ్ రమేశ్‌పై సస్పెన్షన్ వేటు

జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ జట్టు కోచ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేశ్‌ను ‘నాడా’ సస్పెండ్ చేసింది. ఆయనతో పాటు తెలుగు అథ్లెట్లు శ్రీనివాస్, ప్రత్యూష సహా మొత్తం ఏడుగురిపై వేటు వేసింది. క్రీడాకారులు డోపింగ్ టెస్టులకు శాంపిల్స్ ఇవ్వకుండా రమేశ్ సహకరించినట్లు ఆరోపణలున్నాయి. దీంతో విచారణ అనంతరం నాడా ఈ చర్యలు చేపట్టింది. తాను ఏ తప్పూ చేయలేదని, తప్పు చేసేవారిని ప్రోత్సహించలేదని రమేశ్ తెలిపారు.
News April 21, 2025
కాసేపట్లో భారత్‌కు వాన్స్

US ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దంపతులు ఉ.9.30 గంటలకు ఢిల్లీలోని పాలం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కానున్నారు. ఆయన భార్య ఉషా వాన్స్, పిల్లలు ఇవాన్, వివేక్, మీరాబెల్‌లతో కలిసి 4 రోజుల పాటు దేశంలో పర్యటిస్తారు. ఢిల్లీ అక్షర్‌ధామ్ ఆలయం, హస్తకళల మార్కెట్‌ను సందర్శించాక సా.6.30 గంటలకు PM మోదీతో భేటీ అవుతారు. ధ్వైపాక్షిక చర్చల అనంతరం వాన్స్ దంపతులకు మోదీ విందు ఇస్తారు. ఇవాళ రాత్రికి రాజస్థాన్ పర్యటనకు వెళ్తారు.