News March 13, 2025

భీమిని: ప్రధానోపాధ్యాయుడి అరెస్ట్: ఎస్సై

image

భీమిని మండలం జగ్గయ్యపేట ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రమేశ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. పాఠశాలలో చదువుతున్న బాలికతో అసభ్యంగా ప్రవర్తించినందుకు పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు బుధవారం అరెస్టు చేసి బెల్లంపల్లి కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చినట్లు ఎస్సై పేర్కొన్నారు.

Similar News

News March 16, 2026

సిద్దిపేట: ఈ నెల 22న సీఎం పర్యటనపై మంత్రుల సమీక్ష

image

సిద్దిపేట జిల్లా నర్మేటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ఈనెల 22న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సచివాలయంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సభకు వచ్చే రైతులకు తాగునీరు, రవాణా సౌకర్యాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. ఏర్పాట్లపై అధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు.

News March 16, 2026

ఖమ్మం: ఏడాది దాటినా అందని యాసంగి బోనస్

image

గత ఏడాది (2024-25) యాసంగి సీజన్లో సన్నరకం ధాన్యం విక్రయించిన రైతాంగానికి బోనస్ సొమ్ము అందకపోవడంతో ఆవేదన వ్యక్తమవుతోంది. ఖమ్మం జిల్లాలో 18,833 మంది రైతులకు రావాల్సిన రూ.63.63 కోట్ల బోనస్ ఏడాది దాటినా పెండింగ్‌లోనే ఉంది. వానాకాలం సీజన్‌కు బోనస్ ఇచ్చిన ప్రభుత్వం, గత యాసంగి బకాయిలను వెంటనే విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

News March 16, 2026

NTR: APCRDAకు ప్రతిష్ఠాత్మక ఎకనామిక్స్ టైమ్స్ GOVTECH అవార్డు-2026

image

APCRDAకు ప్రతిష్ఠాత్మక ఎకనామిక్స్ టైమ్స్ GOVTECH అవార్డు-2026 లభించింది. ఈ మేరకు కమిషనర్ కె. కన్నబాబు ఓ ప్రకటన విడుదల చేశారు. అమరావతి ఇంటిగ్రేటెడ్ డిజిటల్ అర్బన్ ప్లానింగ్ & గవర్నెన్స్ ప్లాట్‌ఫామ్ ఈ అవార్డుకు ఎంపికైందని, అమరావతి మాస్టర్ ప్లాన్ ఆధారంగా దీన్ని రూపొందించామన్నారు. ప్రభుత్వ రంగంలో దేశంలో అమలు చేస్తున్న ఉత్తమ సాంకేతిక ప్రాజెక్టులలో ఒకటిగా అమరావతి డిజిటల్ ట్విన్ ఎంపికైందన్నారు.