News March 13, 2025
MHBD: ప్రేమగా మారిన మూగ పరిచయం

మూగవారే.. అయితేనేం. ప్రేమించుకున్నారు. వివాహంతో ఒక్కటయ్యారు. MHBD జిల్లా గార్ల మండలానికి చెందిన అశ్విన్‌సాయి, తూర్పుగోదావరి(ఏపీ) జిల్లాకు చెందిన బుజ్జి ఇద్దరు మూగవారే. రెండేళ్ల క్రితం ఏర్పడిన వీరి పరిచయం ప్రేమగా చిగురించింది. ఇంట్లో పెద్దలను ఒప్పించి బుధవారం గార్లలో వివాహం చేసుకున్నారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు.
Similar News
News March 21, 2026
విశాఖ: డొమెస్టిక్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ జోరు

విశాఖ జిల్లాలో ఎల్పీజీ కొరత తీవ్రంగా మారింది. చిరు వ్యాపారులు డొమెస్టిక్ సిలిండర్లను బ్లాక్‌లో రూ.2000-2500లకు కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. మార్చి 20 నాటికి 1.16 లక్షల సిలిండర్లు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లాలో 62 గ్యాస్ ఏజెన్సీలు, 8.95 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు హెచ్పీసీఎల్, ఐఓసీ బాటిలింగ్ యూనిట్ల వద్ద ప్రభుత్వం పర్యవేక్షణ అధికారులను నియమించింది.
News March 21, 2026
Wah.. నగరమంతా నోరూరించే సువాసన

రంజాన్ అనగానే షీర్ ఖుర్మా గుర్తొస్తుంది. నగరమంతా దీని గుమగుమలతో నిండిపోతుంది. గల్లీల్లో దోస్తులందరినీ ఇంటికి పిలిచి దావత్ ఇచ్చి ఆఖరున షీర్ ఖుర్మాతో నోరు తీపి చేస్తారు. ఈ షీర్ ఖుర్మాకు ప్రత్యేకత ఉంది. పాలను బాగా మరిగించి ఖర్జూరాల తీపితో చేసే ఈ డెజర్ట్ తక్షణ శక్తినిస్తుంది. దీంట్లోని కాల్షయం, ప్రోటీన్లు ఎముకలను బలపరిచి, జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయని నిపుణుల మాట.
News March 21, 2026
6న అనంతపురం JNTU స్నాతకోత్సవం

అనంతపురం JNTU 15వ స్నాతకోత్సవాన్ని ఏప్రిల్ 6న నిర్వహిస్తున్నట్లు వీసీ హంచాటే సుదర్శన రావు తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి యూజీ, పీజీ, పీహెచ్.డీ పట్టాలను అందజేస్తామన్నారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఛాన్స్‌లర్ హోదాలో స్నాతకోత్సవాన్ని హాజరుకానున్నారు.


