News March 13, 2025
మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

AP: రాష్ట్రంలోని 164 మోడల్ స్కూళ్లలో ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 17 నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవచ్చని విద్యాశాఖ తెలిపింది మార్చి 18 నుంచి మే 22 లోగా దరఖాస్తులు సమర్పించాలని పేర్కొంది. టెన్త్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్, రిజర్వేషన్ల ప్రతిపాదికన మే 26న సీట్లు కేటాయిస్తారు. 27న వెరిఫికేషన్ నిర్వహిస్తారు. జూన్‌లో తరగతులు ప్రారంభమవుతాయి. apms.ap.gov.in
Similar News
News March 13, 2025
అసెంబ్లీ వద్ద భారీగా మార్షల్స్ మోహరింపు

తెలంగాణ అసెంబ్లీలో ఘర్షణ వాతావరణం నెలకొంది. స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి <<15744584>>వ్యాఖ్యలు<<>> తీవ్ర దుమారం రేపాయి. దీంతో సభను స్పీకర్ వాయిదా వేయగా కొద్దిసేపటి క్రితమే తిరిగి పున:ప్రారంభం అయింది. జగదీశ్‌పై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అటు సభ వద్ద భారీగా మార్షల్స్‌ను మోహరించారు.
News March 13, 2025
రోహిత్ శర్మ ఎందుకు రిటైరవుతారు?: డివిలియర్స్

రోహిత్ శర్మ రిటైర్మెంట్ రూమర్లపై మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ స్పందించారు. ‘ప్రస్తుతం రోహిత్ ఆట మామూలుగా లేదు. కెప్టెన్సీ కూడా అద్భుతంగా చేస్తున్నారు. ఇలాంటి దశలో ఆయనెందుకు రిటైరవుతారు? ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో రోహిత్ ఆడిన తీరు అసాధారణం. నాయకుడిగా ముందుండి నడిపించారు. రిటైర్ కావడానికి కారణమే లేదు. ఆయనపై విమర్శలకూ స్కోప్ లేదు. ఆయన రికార్డులే ఆ మాట చెబుతాయి’ అని పేర్కొన్నారు.
News March 13, 2025
‘కోర్ట్’కు పాజిటివ్ టాక్.. ప్రియదర్శి ఎమోషనల్

ప్రియదర్శి, శివాజీ, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో రామ్ జగదీశ్ తెరకెక్కించిన ‘కోర్ట్’ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే, ప్రీమియర్స్‌లో ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి ప్రియదర్శి ఎమోషనల్ అయ్యారు. థియేటర్‌లో నేలపై కూర్చొని నిర్మాత నానిని హత్తుకొని తన సంతోషాన్ని పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను నాని షేర్ చేశారు.