News March 13, 2025
గన్నవరం: వంశీ బెయిల్ పిటిషన్‌పై విచారణ

సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో రిమాండ్‌లో ఉన్న వంశీ బెయిల్ పిటిషన్‌పై నేడు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానంలో గురువారం మరోసారి విచారణ జరగనుంది. గతంలో వంశీకి బెయిల్ నిరాకరించగా, తాజా పిటిషన్‌పై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది. గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి కేసులో ఈ 71గా వంశీ ఉన్నారు. ఇటీవల నియోజకవర్గంలో పలు కేసులు ఆయనపై నమోదయ్యాయి.
Similar News
News March 13, 2025
కిడ్నీలను కాపాడుకుందామిలా

శరీరంలో మూత్రపిండాల పనితీరు చాలా కీలకం. వాటిని కాపాడుకునేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. అవి:
రక్తపోటు, మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలి. పంచదార, ఉప్పు, కొవ్వులు పరిమితంగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. నీరు పుష్కలంగా తాగాలి. డీహైడ్రేషన్ కిడ్నీలకు ప్రమాదకరం. ఇష్టారాజ్యంగా ఔషధాల్ని వాడకూడదు. రక్తపోటు, మధుమేహం, క్రియేటినిన్ స్థాయులపై కన్నేసి ఉంచాలి.
* నేడు ప్రపంచ కిడ్నీ దినోత్సవం
News March 13, 2025
అనంతపురం కోర్టులో నారా లోకేశ్‌పై ఫిర్యాదు

అనంతపురం కోర్టులో మంత్రి నారా లోకేశ్‌పై వైసీపీ నేత చవ్వా రాజశేఖర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రులు రోజా, విడదల రజిని ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు చేస్తున్నారని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, దీంతో న్యాయం కోసం కోర్టును ఆశ్రయించామన్నారు. ఆ పోస్టుల వెనుక లోకేశ్ ఉన్నారని ఆరోపించారు.
News March 13, 2025
అనకాపల్లిలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్రపై సమీక్ష

అనకాపల్లి కలెక్టరేట్‌లో గురువారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్రపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ.. ఈనెల 15వ తేదీన నిర్వహించే శుభ్రత కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ మేరకు గోడపత్రిలు కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.