News March 13, 2025
MHBD: ప్రేమగా మారిన మూగ పరిచయం

మూగవారే.. అయితేనేం. ప్రేమించుకున్నారు. వివాహంతో ఒక్కటయ్యారు. MHBD జిల్లా గార్ల మండలానికి చెందిన అశ్విన్‌సాయి, తూర్పుగోదావరి(ఏపీ) జిల్లాకు చెందిన బుజ్జి ఇద్దరు మూగవారే. రెండేళ్ల క్రితం ఏర్పడిన వీరి పరిచయం ప్రేమగా చిగురించింది. ఇంట్లో పెద్దలను ఒప్పించి బుధవారం గార్లలో వివాహం చేసుకున్నారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు.
Similar News
News March 13, 2025
రోహిత్ శర్మ ఎందుకు రిటైరవుతారు?: డివిలియర్స్

రోహిత్ శర్మ రిటైర్మెంట్ రూమర్లపై మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ స్పందించారు. ‘ప్రస్తుతం రోహిత్ ఆట మామూలుగా లేదు. కెప్టెన్సీ కూడా అద్భుతంగా చేస్తున్నారు. ఇలాంటి దశలో ఆయనెందుకు రిటైరవుతారు? ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో రోహిత్ ఆడిన తీరు అసాధారణం. నాయకుడిగా ముందుండి నడిపించారు. రిటైర్ కావడానికి కారణమే లేదు. ఆయనపై విమర్శలకూ స్కోప్ లేదు. ఆయన రికార్డులే ఆ మాట చెబుతాయి’ అని పేర్కొన్నారు.
News March 13, 2025
నంద్యాల: బొలెరోతో ఢీకొట్టి.. చోరీ

బేతంచర్లకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి జస్వంత్ నంద్యాలలో బైక్‌ను కొనుగోలు చేసి బేతంచర్లకు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో తమ్మరాజు పల్లె ఘాట్ వద్ద దుండగులు జస్వంత్ బైకును బొలెరోతో ఢీ కొట్టారు. జస్వంత్ కిందపడిపోగా అతని చేతికి ఉన్న 4 తులాల బ్రేస్‌లెట్, 2 ఉంగరాలను బొలెరోలో వచ్చిన ముగ్గురు దొంగలు దోచుకున్నారు. ఘటనపై పాణ్యం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
News March 13, 2025
తుళ్లూరు: మైక్రోసాఫ్ట్‌తో లోకేశ్ కీలక ఒప్పందం

రాష్ట్రంలోని యువతకు ఎఐ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల్లో నైపుణ్యాభివృద్ధి కోసం మైక్రోసాఫ్ట్‌తో ఎపీ ప్రభుత్వం కీలకమైన ఒప్పందం చేసుకుంది. సచివాలయంలో గురువారం మంత్రి లోకేశ్ సమక్షంలో మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు, ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ అధికారులు ఎంఓయుపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఏడాది వ్యవధిలో 2లక్షల మంది యువతకు మైక్రోసాఫ్ట్ సంస్థ స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ ఇస్తుందని లోకేశ్ తెలిపారు.