News March 13, 2025

MHBD: ప్రేమగా మారిన మూగ పరిచయం

image

మూగవారే.. అయితేనేం. ప్రేమించుకున్నారు. వివాహంతో ఒక్కటయ్యారు. MHBD జిల్లా గార్ల మండలానికి చెందిన అశ్విన్‌సాయి, తూర్పుగోదావరి(ఏపీ) జిల్లాకు చెందిన బుజ్జి ఇద్దరు మూగవారే. రెండేళ్ల క్రితం ఏర్పడిన వీరి పరిచయం ప్రేమగా చిగురించింది. ఇంట్లో పెద్దలను ఒప్పించి బుధవారం గార్లలో వివాహం చేసుకున్నారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు.

Similar News

News March 14, 2025

SPMVV : ఫలితాలు విడుదల

image

శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఏడాది జనవరిలో (M.B.A) మీడియా మేనేజ్మెంట్ మొదటి సెమిస్టర్, ఫిబ్రవరి నెలలో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (B.Ed) మొదటి సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు మహిళ యూనివర్సిటీ కార్యాలయం పేర్కొంది. ఫలితాలను https://www.spmvv.ac.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

News March 14, 2025

MLG: బాల్యంలో ఈ పూలతోనే హోలీ (PHOTO)

image

ములుగుల్లో ఓ చెట్టుకు విరబూసిన పూలు మన బాల్యాన్ని గుర్తుచేస్తున్నాయి. ఒంటిపూట బడికెళ్తుంటే రోడ్డు పక్కనే ఇవి గుబాలించేవి. ఈ పూల మకరందం రుచిచూసి మైమరచిన బాల్యం మళ్లీ గుర్తొస్తోంది. పండగొస్తుంది అనే సంబరంలో ఎండలో తిరిగి ఈ పూలను ఒకరోజు ముందే సేకరించేవాళ్లం. నీటిలో ఉడికించి రంగు ఊరిన నీళ్లతో ఆడిన హోలీ బాల్యంలో ఓ మధురజ్ఞాపకమే. ఈ ఏడాదైనా మోదుగ పూలతో హోలీ జరుపుకోండి. HAPPY HOLI

News March 14, 2025

భూముల వివాదాల పరిష్కారానికి కృషి చేయాలి : కలెక్టర్

image

ప్రస్తుతం జరుగుతున్న రీసర్వేలో అటవీ అధికారులు భాగస్వాములై ఆయా భూముల వివాదాల పరిష్కారానికి కృషి చేయాల్సిందిగా కలెక్టర్ ఆనంద్ కోరారు. గురువారం కలెక్టరేట్లోని ఎస్‌ఆర్ శంకరన్ హాల్లో అటవీ, వన్యప్రాణుల రక్షణపై సమీక్షా సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. తొలుత సమావేశ ఉద్దేశాలను జిల్లా అటవీ శాఖాధికారి మహబూబ్ భాషా వివరించారు.

error: Content is protected !!