News March 13, 2025
ఇన్‌స్టా పరిచయం గొడవకు దారితీసింది!

ఇన్‌స్టా పరిచయం యువతి, యువకుడి గొడవకు కారణమైంది. అనంతపురంలోని SKUలో చదువుతున్న ఓ యువతికి తిరుపతి యువకుడితో ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడింది. కొద్దిరోజులు ఇరువురూ చాట్ చేసుకున్నారు. యువకుడు డెయిరీలో పని చేస్తున్నాడని తెలుసుకున్న యువతి షాక్‌గు గురైంది. వెంటనే బ్లాక్ చేసింది. ఆగ్రహానికి గురైన యువకుడు నిన్న నగరానికి వచ్చి యువతితో గొడవపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు హెచ్చరించి యువకుడిని పంపించారు.
Similar News
News March 13, 2025
ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు

2025 మార్చి ఒకటి నుంచి నెల్లూరు జిల్లాలో 79 కేంద్రాలలో ప్రారంభమైన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రధాన పరీక్షలు గురువారంతో ప్రశాంతంగా ముగిశాయని ఇంటర్మీడియట్ బోర్డు నెల్లూరు జిల్లా ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి డాక్టర్ ఏ శ్రీనివాసులు తెలిపారు. గురువారం నాటి జనరల్ విభాగంలో 27,753 మంది విద్యార్థులకు గాను 792 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని, ఒకేషనల్ విభాగంలో 730 మందికి గాను 104 మంది గైర్హాజరయ్యారన్నారు.
News March 13, 2025
BC-D కేటగిరిలో 3వ ర్యాంకు సాధించిన ధర్మపురి వాసి

ధర్మపురి మండలం తుమ్మెనాల గ్రామానికి చెందిన రేణు మోహన్ ఇటీవల విడుదల అయినా గ్రూప్-2 ఫలితాలలో రాష్ట్రస్థాయిలో 155 ర్యాంకు, బాసర జోన్లో 11వ ర్యాంకు, BC-D కేటగిరి లో 3వ ర్యాంకు సాధించారు. ప్రస్తుతం నిజామాబాద్ బిసి సంక్షేమ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు ఐలయ్య, నర్సవ్వ సంతోషం వ్యక్తం చేశారు. గ్రామస్థులు శుభాకాంక్షలు తెలిపారు.
News March 13, 2025
జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

తెలంగాణ అసెంబ్లీ సంచలన నిర్ణయం తీసుకుంది. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు. ఈ సెషన్ పూర్తయ్యేవరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని పేర్కొన్నారు. వెంటనే ఆయన సభ నుంచి బయటికి వెళ్లాలని ఆదేశించారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు.