News March 13, 2025
వికారాబాద్: నీటి ఎద్దడి రాకుండా చర్యలు చేపట్టాలి: డీపీవో

వేసవి కాలం నేపథ్యంలో ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా తగు చర్యలు తీసుకోవాలని, అలాగే ప్రతి ఒక్కరూ గ్రామాల్లో వంద శాతం ట్యాక్స్ డబ్బులు వసూలు చేయాలని జిల్లా పంచాయతీ అధికారిణి, డాక్టర్ జయసుధ సూచించారు. ఆమె ధారూర్ మండలంలో గ్రామ పంచాయతీల్లో ఫీల్డ్ ఇన్స్‌పెక్షన్ నిర్వహించారు. చింతకుంట, కెరెల్లి గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు.
Similar News
News September 16, 2025
అనకాపల్లి: ‘మత్స్యకారులపై పోలీసులు ఆంక్షలు తగదు’

బల్క్ డ్రగ్ పార్క్‌కు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తున్న మత్స్యకారులపై పోలీసులు ఆంక్షలు విధించడం తగదని సీపీఎం జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు అన్నారు. సోమవారం అనకాపల్లిలో మాట్లాడుతూ.. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సీపీఎం జిల్లా నేత అప్పలరాజులు గృహ నిర్బంధం విధించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పేర్కొన్నారు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తే సముద్రంలో మత్స్య సంపద నాశనం అవుతుందన్నారు.
News September 16, 2025
విజయవాడ: ఉప్మా దోశ విషయంలో దాడి.. నిందితుడు అరెస్ట్

విజయవాడ శివారు జక్కంపూడిలోని ఓ హోటల్‌లో ఉప్మా దోశ ఆర్డర్ విషయంలో ఆదివారం గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హోటల్ సప్లయర్ పోలిశెట్టి రాజు కస్టమర్ కరిముల్లాపై చాకుతో దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటనపై కేసు నమోదు అయినట్లు కొత్తపేట సీఐ కొండలరావు తెలిపారు. రాజుని అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.
News September 16, 2025
గరుగుబిల్లి: రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ ఆర్మీ జవాన్ మృతి

గరుగుబిల్లి మండలం నందివానవలస కోళ్లు ఫారం వద్ద సోమవారం రాత్రి జరిగిన ప్రమాదంలో గిజబ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ మరాడన ఆదినారాయణ మృతి చెందాడు. ఖడ్గవలస నుంచి రాత్రి 10 గంటల సమయంలో స్వగ్రామం గిజబకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఓ వాహనం ఢీకొనడంతో ఆదినారాయణ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై ఎస్‌ఐ ఫక్రుద్దీన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.