News March 13, 2025

వికారాబాద్ జిల్లాలో ఏడుగురికి జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు 

image

జూనియర్ లెక్చరర్లుగా ఎంపికైన వారికి రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందజేశారు. అందులో భాగంగా వికారాబాద్ జిల్లాలో ఏడుగురికి జూనియర్ లెక్చరర్లగా ఉద్యోగాలు వచ్చాయి. అందులో జిల్లాకు చెందిన హరిత రాణి, పద్మజ, సానియా సుల్తానా, భార్గవి, రాజు నాయక్, కమల్ రాజ్, అనంతయ్య ఉన్నారు.  

Similar News

News March 24, 2026

WGL: అసెంబ్లీకి ఐదుగురు అతివలు!

image

పార్లమెంటులో 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షం లభించనుండటంతో వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయం కొత్త పుంతలు తొక్కనుంది. నియోజకవర్గాల పునర్విభజనతో పెరిగే 16 స్థానాల్లో కనీసం 4 నుంచి 5 స్థానాలు మహిళలకు కేటాయించే అవకాశం ఉంది. దీంతో కీలక స్థానాల్లో మహిళా నేతలు పోటీ చేసేందుకు సిద్ధమవుతుండగా, జిల్లా నుంచి ఐదుగురు మహిళా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం కనిపిస్తోంది.

News March 24, 2026

టిబి ముక్త్ భారత్ అభియాన్ ద్వారా క్యాంపెయినింగ్

image

టిబి ముక్త్ భారత్ అభియాన్ ద్వారా ప్రత్యేక క్యాంపెయినింగ్ గతేడాది జూన్‌లో ప్రారంభించినట్లు HNK జిల్లా టీబీ కంట్రోల్ ఆఫీసర్ డాక్టర్ హిమబిందు తెలిపారు. ఇందులో భాగంగా 1.98,000 మంది హై రిస్క్ జనాభాలో 60 ఏళ్ల పైబడిన వారు డయాబెటిక్స్, ధూమపానం, మద్యపానం అలవాటు ఉన్నవారు, హెచ్ఐవీ బాధితులు, తదితర లక్షణాలను గుర్తించామన్నారు. 75,243 మందికి ఎక్స్ రే, 19,824 మందికి తెమడ పరీక్షలు చేశామన్నారు.
#ప్రపంచ క్షయ దినం.

News March 24, 2026

RR: వాహనాల వేలానికి సిద్ధమైన ఆర్టీఏ

image

ఆర్టీఏ పరిధిలోని సీజ్డ్ వాహనాలను బహిరంగ వేలం వేసేందుకు అధికారులు సిద్దమయ్యారు. ఆర్టీసీ డిపోల్లో ఏళ్లుగా పోగుపడిన వాహనాలతో పార్కింగ్ సమస్య తీవ్రమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రంగారెడ్డి జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్& ఆర్టీఏ సెక్రటరీ సదానంద తెలిపారు. జాబితాలో పేర్లున్న వాహనాల యజమానులు, ఫైనాన్షియర్లు మార్చి 27లోపు అధికారుల నుంచి రిలీజ్ ఆర్డర్ తీసుకోవాలని ఆయన కోరారు.