News March 13, 2025
NLG: యువ వికాసంపై చిగురిస్తున్న ఆశలు

రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు ఉపాధి కల్పించేందుకు ‘రాజీవ్ యువ వికాసం’ పేరుతో కొత్త పథకానికి కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో ఐదు లక్షల మందికి ప్రయోజనం కల్పించేందుకు ఈ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కనీసం 30వేల మందికి ప్రయోజనం కలుగుతుందని ఆశిస్తున్నారు. అర్హులైన వారిని ఎంపిక చేసి వారికి ఉపాధి కల్పిస్తేనే పథకం విజయవంతం అవుతుందని అంటున్నారు.
Similar News
News March 13, 2025
నల్గొండ: మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు: SP

జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ముందస్తుగా హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. హోలీ వేడుకలు ఇతరులకు హాని కలిగించకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కేసు ఫైల్ కావడంతో పాటు వాహనాలు సీజ్ చేస్తామన్నారు.
News March 13, 2025
నల్గొండ: పోలీస్ శాఖకు టీం స్పిరిట్ చాలాముఖ్యం: కలెక్టర్

పోలీస్ శాఖకు టీంస్పిరిట్ చాలా ముఖ్యమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ను గురువారం ఎస్పీ శరత్ చంద్ర పవర్తో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోలీస్ ఉద్యోగం ఒత్తిడితో చేసే ఉద్యోగమని.. శారీరక స్ఫూర్తితో పాటు మానసికంగా అలర్ట్ కావడానికి క్రీడలు ఉపయోగపడతాయన్నారు.
News March 13, 2025
నల్గొండ: హోలీ ప్రశాంతంగా జరుపుకోవాలి: SP

హోళీ వేడుకలు ఇతరులకు హాని కలిగించకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆకతాయిల కోసం షీ టీమ్ బృందాల నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని అన్నారు. హోలీ వేడుకలలో అల్లరి సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.