News March 13, 2025

రేపు పత్తికొండలో టమాటా ప్రాసెసింగ్ యూనిట్‌కు భూమిపూజ

image

పత్తికొండ మండలంలో టమాటా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు మరో ముందడుకు పడింది. రూ.11కోట్ల వ్యయంతో కోతిరాళ్ల పంచాయతీ పరిధిలో ఈ యానిట్ ఏర్పాటుకు రేపు భూమి పూజ జరగనుంది. మంత్రి TG భరత్, ఎమ్మెల్యే శ్యామ్‌కుమార్ భూమి పూజ చేసి పనులను ప్రారంభించనున్నారు. కాగా పత్తికొండ, మద్దికెర, తుగ్గలి, క్రిష్ణగిరి, వెల్దుర్తి మండలాల్లో టమాటా అధికంగా సాగువుతోంది. ఈయూనిట్ ప్రారంభమైతే తమకు ధర లభిస్తుందని రైతులు ఆశిస్తున్నారు.

Similar News

News March 14, 2026

భూ సమస్యల పరిష్కారమే లక్ష్యం: కలెక్టర్

image

జిల్లాలో రెవెన్యూ భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ సిరి తెలిపారు. ప్రతీ సోమవారం రెవెన్యూ క్లినిక్‌లు నిర్వహించి మ్యుటేషన్లు, అసైన్‌మెంట్, డాటెడ్ ల్యాండ్స్ సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు. డిసెంబర్ చివరి వారం నుంచి ఇప్పటివరకు వచ్చిన 1,523 దరఖాస్తుల్లో 724 పరిష్కరించగా, మిగిలినవి పరిశీలనలో ఉన్నాయని తెలిపారు.

News March 14, 2026

కర్నూలులో 397 మంది విద్యార్థులు గైర్హాజరు

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా శనివారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు 397 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 5,522 మందికి గాను 5,125 మంది మాత్రమే హాజరైనట్లు RIO లాలప్ప తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద నిఘా పెంచామని, జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని స్పష్టం చేశారు. విద్యార్థులు నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా పరీక్షలు రాశారని ఆయన వెల్లడించారు.

News March 14, 2026

10వ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్: కలెక్టర్

image

కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పదో తరగతి పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద కఠినంగా 144 సెక్షన్ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పరీక్షల సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రతి కేంద్రంలోనూ తాగునీరు, ఓఆర్ఎస్ (ORS) ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.