News March 13, 2025

SRPT: ఇందిరమ్మ ఇళ్లకు కలగని మోక్షం!

image

సూర్యాపేట జిల్లాలో తమకు నిరాశే ఎదురవుతుందని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసినా ఇందిరమ్మ ఇళ్ల పథకం గురించి అధికారులు ఊసేత్తడం లేదని చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 3,09,062 దరఖాస్తులు స్వీకరించారు. జాబితాలో పేర్లు లేని వారి నుంచి మరో 28,225 దరఖాస్తులు స్వీకరించారు. వారంతా ఇప్పుడు అయోమయంలో పడుతున్నారు.

Similar News

News March 22, 2026

గ్రీన్ ఎనర్జీలో ఏపీ నంబర్-1: సీఎం చంద్రబాబు

image

భవిష్యత్తులో అన్ని కంపెనీల డేటా సెంటర్లు భారత్‌కే వస్తాయని ఏపీ సీఎం చంద్రబాబు జోస్యం చెప్పారు. HYD ISBలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘ఏపీకి ఏఐ, క్వాంటం టెక్నాలజీ, డేటా సెంటర్లను తీసుకొచ్చాం. వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాలకు ప్రాధాన్యం ఇచ్చాం. సోలార్, గ్రీన్, విండ్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నాం. ప్రస్తుతం గ్రీన్ ఎనర్జీ రంగంలో దక్షిణాదిలో మేమే నంబర్-1’ అని తెలిపారు.

News March 22, 2026

చిత్తూరు జిల్లా SP వినతి

image

చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించనున్నట్లు SP ఆఫీసు వెల్లడించింది. ఉ.10:30 గంటలకు పాత డీపీఓ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను జిల్లా స్థాయి పోలీస్ అధికారులకు నేరుగా తెలియజేసి సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. ఫిర్యాదుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బాధితులకు తెలిపారు.

News March 22, 2026

IPL చరిత్రలోనే తొలిసారి

image

SRH తాత్కాలిక కెప్టెన్‌గా ఇషాన్‌ను నియమించడంతో ఈ ఏడాది IPL ఓ ప్రత్యేకతను సొంతం చేసుకుంది. 18 సీజన్లలో తొలిసారి ఆరంభ మ్యాచ్‌లకు అన్ని జట్లకూ భారత ఆటగాళ్లే నాయకత్వం వహించనున్నారు. రజత్(RCB), శ్రేయస్(PBKS), పరాగ్(RR), హార్దిక్(MI), రుతురాజ్(CSK), అక్షర్(DC), గిల్(GT), రహానే(KKR), పంత్(LSG) టీమ్స్‌ను లీడ్ చేయనున్నారు. 2019 సీజన్ మధ్యలో ఒకట్రెండు మ్యాచ్‌లకు ఇలా జరిగింది.