News March 13, 2025
ప్రకాశం: సమస్యాత్మకంగా 6 పరీక్షా కేంద్రాలు

ప్రకాశం జిల్లాలో ఈనెల 17వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు జరుగనున్నాయి. జిల్లాలో 6 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కొమరోలు గవర్నమెంట్ హైస్కూల్, బెస్తవారిపేట మండలం పిటికాయగుళ్ల, పెద్దారవీడు మండలం వైడిపాడు, అర్ధవీడు మండలం మాచవరం, రాచర్ల, CSపురం జిల్లా పరిషత్ పాఠశాలలను సమస్యాత్మకమైన కేంద్రాలుగా గుర్తించారు. ఆయా సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు.
Similar News
News April 19, 2026
పరిష్కార వేదిక సమయంలో మార్పులు: DRO

ఒంగోలులో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే నిర్వహిస్తామని DRO ఓబులేసు ప్రకటించారు. జిల్లాలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌కు అర్జీలు సమర్పించేవారు ఈ సమయంలోనే ఇచ్చి 12.30 గంటలకల్లా తిరిగి నివాసగృహాలకు చేరుకోవాలని సూచించారు.
News April 19, 2026
కొత్తపట్నం బీచ్‌లో మృతదేహం.. పచ్చబొట్టే ఆదారం

కొత్తపట్నం మండలం పిన్నివారిపాలెం బీచ్ వద్ద ఆదివారం గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానిక మత్స్యకారులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఎవరైనా చంపి అక్కడ పడేశారా..? లేక ఆమె ఆత్మహత్య చేసుకున్నారా..? అన్న పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆమె చేతిపై P.ఎల్లమ్మ అనే పచ్చబొట్టు ఉంది.
News April 19, 2026
అక్షయ తృతీయ.. ప్రకాశంలో బంగారం ధరలు ఇలా..?

అక్షయ తృతీయ కావడంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బంగారు దుకాణాలు కళకళలాడుతున్నాయి. పసిడి ధరలు అంతకంతకూ పెరిగిపోతున్నా.. కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆదివారం 24 క్యారెట్ల తులం(10 గ్రాములు) బంగారం ధర రూ.1,54,100గా ఉంది. 22 క్యారెట్ల తులం రూ.1,42,500 పలుకుతోంది.


