News March 13, 2025
సంగారెడ్డి జిల్లాలో మహిళ హత్య

ఓ మహిళను గుర్తు తెలియని దుండగులు హత్య చేసి ఆమె వద్దనున్న బంగారు కమ్మలు ఎత్తుకెళ్లిన ఘటన సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం ఖాదిరాబాద్ గ్రామంలో జరిగింది. స్థానికులు, ASI..కథనం ప్రకారం గ్రామానికి చెందిన గౌరమ్మ (45)ను బుధవారం అర్ధరాత్రి ఎవరో హత్య చేసి పరారయ్యారు. ఘటనా స్థలానికి SP పరితోష్ పంకజ్ చేరుకొని పరిశీలించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తామన్నారు.
Similar News
News July 5, 2025
కాసేపట్లో వర్షం: వాతావరణ కేంద్రం

TG: రాబోయే 2-3 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, జగిత్యాల, భూపాలపల్లి, గద్వాల్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, మెదక్, మేడ్చల్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో వర్షం పడుతుందని అంచనా వేసింది. గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
News July 5, 2025
HYD: స్వల్పంగా పెరిగిన డెంగీ కేసులు: మంత్రి

హైదరాబాద్లో డెంగీ కేసులు స్వల్పంగా పెరిగాయని మంత్రి దామోదర రాజనర్సింహా తెలిపారు. యాంటిలార్వా ఆపరేషన్లు ముమ్మరం చేయాలని, ట్రైబల్ ఏరియాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన ఆదేశించారు. ప్రైవేట్ ఆస్పత్రులు దోపిడీకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చికిత్స తీసుకోవాలని
మంత్రి సూచించారు.
News July 5, 2025
సహకార వ్యవస్థ బలోపేతానికి కృషి: కలెక్టర్

కృష్ణా జిల్లాలో సహకార వ్యవస్థను బలోపేతం చేసేందుకు సహకార సంస్థలు సమ్మిళితమై స్థిరమైన అభివృద్ధి మార్గాలతో మెరుగైన ప్రపంచాన్ని నిర్మించేందుకు ముందుకు రావాలని కలెక్టర్ బాలాజీ పిలుపునిచ్చారు. జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో శనివారం నిర్వహించిన 103వ అంతర్జాతీయ సహకార దినోత్సవంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ముందుగా కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటి, సహకార సంఘాల పతాకాన్ని ఎగురవేశారు.