News March 13, 2025

ఐ.పోలవరం: రోడ్డు ప్రమాదంలో తోబుట్టువులకు పుత్ర శోకం

image

ఐ.పోలవరం మండలం ఎదురులంక వారధిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తోబుట్టువుల కొడుకులు మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముమ్మిడివరం M కొత్తలంకకు చెందిన సాంబశివ (14), తాళ్ళరేవు M సుంకరపాలానికి చెందిన వీరేంద్ర (18) మృతి చెందిన విషయం తెలిసిందే. బైక్ పై వస్తున్న వీరిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. సాంబశివ 9వ తరగతి చదువుతుండగా వీరేంద్ర మినీ ఆటో యజమాని.

Similar News

News March 14, 2025

హోలీ పండుగ.. కోనసీమ ఎస్పీ సూచనలు

image

హోలీ పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావు సూచించారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ సీసీటీవీల ద్వారా హోలీ వేడుకలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్లు బహిరంగ ప్రదేశాల్లో ఇతరులపై రంగులు చల్లటం వంటి చర్యలకు పాల్పడవద్దన్నారు. హోలీలో ఎటువంటి రసాయనిక రంగులను వాడొద్దని ఎస్పీ సూచించారు.

News March 14, 2025

వికారాబాద్: హోలీ.. మార్కెట్‌లు బిజీ.. బిజీ..!

image

నేడు హోలీ పండుగ నేపథ్యంలో జిల్లాలోని మార్కెట్లన్నీ బిజీ.. బిజీ.. అయిపోయాయి. అధిక మోతాదులో హోలీ రంగులు కొనుగోలు చేసేందుకు తక్కువ ధరకు లభించే దుకాణాల వద్దకు ప్రజలు క్యూ కడుతున్నారు. రంగులు పిచికారీ చేసే స్ప్రేయర్లు, పిల్లల కోసం స్పెషల్‌గా రకరకాల గన్ స్ప్రేలు, బ్యాగ్ స్ప్రేలు, బుల్లెట్ స్ప్రేలు వంటివి చిన్న పిల్లల కోసం మార్కెట్‌లో లభిస్తున్నాయి.

News March 14, 2025

మిర్యాలగూడ: రోడ్డు ప్రమాదం.. వృద్ధుడి మృతి

image

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన మిర్యాలగూడ మండలం శ్రీనివాసనగర్‌లో జరిగింది. ఎస్ఐ వివరాలు.. నేరేడుచర్ల మండలం బక్కయ్యగూడెంకి చెందిన సైదులు(60) శ్రీనివాసనగర్‌లో జరుగుతున్న బంధువుల పెళ్లికి వచ్చాడు. తిరుగు ప్రయాణంలో కోదాడ- జడ్చర్ల రాహదారిని దాడుతున్నాడు. ఈ క్రమంలో అతణ్ని బైక్‌ ఢీకొంది. మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రి నుంచి నల్గొండ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.

error: Content is protected !!