News March 13, 2025

కొల్లూరు: లారీ బోల్తా

image

కంకర పోసుకుని వెళుతున్న లారీ బోల్తా పడిన ఘటన కొల్లూరు మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కొల్లూరుకు చెందిన లారీ గుంటూరు నుంచి కంకర లోడ్‌తో గురువారం తెల్లవారుజామున వెళుతుండగా సిమెంట్ రోడ్డు ఒక్కసారిగా ధ్వంసమైంది. దీంతో లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడిందని అన్నారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు అని స్థానికులు తెలిపారు.

Similar News

News January 4, 2026

ముగిసిన GHMC విభజన.. Feb 9న CM గ్రీన్ సిగ్నల్!

image

GHMC కొత్త అధ్యాయం మొదలైంది. 3 కార్పొరేషన్ల ప్రక్రియ 100% పూర్తైంది. ఫైల్ వర్క్, వార్డుల పునర్విభజన సైలెంట్‌గా క్లోజ్ చేసేశారు. 300 వార్డులకు పెంచుతూ పాలనాపరమైన కేటాయింపులూ ముగిశాయి. ముగ్గురు సిటీ ప్లానర్లు వెంకన్న (శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్), ప్రదీప్ కుమార్ (మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీనగర్), శ్రీనివాస్ (చార్మినార్, ఖైరతాబాద్, 6 జోన్లు)కు GHMC బాధ్యతలు అప్పగించింది.

News January 4, 2026

రేపు రాజకీయ పార్టీలతో మున్సిపల్ కమిషనర్ భేటీ

image

భూపాలపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఓటరు జాబితా ముసాయిదాపై సోమవారం ఉదయం 10:30 గంటలకు రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించనున్నట్లు కమిషనర్ ఉదయ్ కుమార్ తెలిపారు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వార్డుల వారీగా రూపొందించిన ఎలక్టోరల్ రోల్ ముసాయిదాపై ఈ భేటీలో చర్చించనున్నారు. పట్టణంలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరై తమ సలహాలు, సూచనలు అందజేయాలని ఆయన కోరారు.

News January 4, 2026

రేపు కాకినాడకు ఎంపీ పురంధేశ్వరి, నటుడు కళ్యాణ్ రామ్

image

రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, సినీ నటుడు నందమూరి కళ్యాణ్ రామ్ సోమవారం కాకినాడ విచ్చేస్తున్నారు. నగరంలో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉదయం 10 గంటలకు రానున్న వారికి ఘనస్వాగతం పలికేందుకు జిల్లా పార్టీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. రాజకీయ, సినీ ప్రముఖుల రాకతో కాకినాడలో సందడి నెలకొంది. పార్టీ శ్రేణులు ఈ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.