News March 13, 2025

NGKL: ప్రభుత్వ ఉద్యోగం సాధించిన యువతి

image

నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం అజిలాపూర్ గ్రామానికి చెందిన సల్వాది లక్ష్మయ్య, నర్సమ్మల కుమార్తె ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్‌గా ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వం నియామక పత్రాన్ని అందజేసింది. పేద కుటుంబానికి చెందిన యువతి ఉద్యోగం సాధించడంతో గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News March 28, 2026

SKU వైస్ ఛాన్స్‌లర్‌గా జ్యోతి కుమార్ బాధ్యతలు

image

శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నూతన వైస్ ఛాన్స్‌లర్‌గా NVR జ్యోతి కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. మిజోరాం యూనివర్సిటీలో కామర్స్ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ఈయనను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈ నెల 13న వైస్ ఛాన్స్‌లర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి నుంచి 3 ఏళ్ల పాటు ఈయన వైస్ ఛాన్స్‌లర్‌గా కొనసాగనున్నారు.

News March 28, 2026

గల్ఫ్ దేశాలకు ఇరాన్ హెచ్చరిక

image

గల్ఫ్ దేశాల గగనతలాలు ఉపయోగించుకొని ఇరాన్‌పై US-ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నాయని ఆ దేశాధ్యక్షుడు పెజెష్కియాన్ మండిపడ్డారు. బహ్రెయిన్, కువైట్, ఖతర్, సౌదీ అరేబియా, UAE తదితర దేశాలపై తాము దాడులు ఆపాలంటే ఆ 2 దేశాలకు అనుమతి ఇవ్వొద్దన్నారు. ఏ దేశంపైనా తాము ముందస్తు దాడులు చేయబోమని.. తమ అణు, ఆర్థిక కేంద్రాలను లక్ష్యం చేసుకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. శత్రువులకు సహకరించిన వారినీ వదలబోమన్నారు.

News March 28, 2026

‘లుంగీ మ్యాన్’గా సిద్ధూ జొన్నలగడ్డ!

image

‘డీజే టిల్లు’గా సినీ ప్రేక్షకులను అలరించిన సిద్ధూ జొన్నలగడ్డ నటిస్తున్న కొత్త సినిమా అప్‌డేట్ వచ్చింది. అనిల్ అనే కొత్త దర్శకుడితో ఆయన చేస్తున్న మూవీకి ‘లుంగీ మ్యాన్’ అనే టైటిల్ ఖరారయినట్లు సమాచారం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీ పూజా కార్యక్రమం ఈనెల 19న జరిగింది. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం కానుంది. కాగా సిద్ధూ చివరి 2 సినిమాలు ‘జాక్’, ‘తెలుసు కదా’ నిరాశపరిచిన సంగతి తెలిసిందే.