News March 13, 2025
మే 9న ‘హరి హర వీరమల్లు’ రిలీజ్?

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తోన్న ‘హరిహర వీరమల్లు’ సినిమా విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది. షూటింగ్ పూర్తికాకపోవడంతో ఈనెల 28న విడుదలయ్యే అవకాశం లేదని సినీవర్గాలు తెలిపాయి. దీంతో రిలీజ్‌ను మే నెలకు వాయిదా వేసినట్లు పేర్కొన్నాయి. మే 9న HHVM విడుదల కానున్నట్లు సమాచారం. కాగా, ఇప్పటికే రిలీజైన సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
Similar News
News March 13, 2025
బిగ్ స్కామ్: Blinkitను గుడ్డిగా నమ్మవద్దంటున్న యూజర్

కస్టమర్లను Blinkit మోసగిస్తోందని ఓ యూజర్ Redditలో పోస్టు పెట్టారు. తాను అరకిలో ద్రాక్షపళ్లను ఆర్డర్ చేస్తే కేవలం 370గ్రా. డెలివరీ చేసిందన్నారు. డౌటొచ్చి మరోసారి ఆర్డర్ చేస్తే మళ్లీ ప్యాకేజ్‌తో సహా 370గ్రా. తూకమే ఉందని పేర్కొన్నారు. ఇదో పెద్ద స్కామ్ అని, ఆర్డర్ చేసినవి కాకుండా నాణ్యత లేని పండ్లు, కూరగాయాలు పంపిస్తోందని ఆరోపించారు. తమకూ ఇలాగే జరిగిందని యూజర్లు రిప్లై ఇచ్చారు. మీకూ ఇలాగే జరిగిందా?
News March 13, 2025
జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ అన్యాయం: కేటీఆర్

TG: అనని మాటలు అన్నట్లుగా చూపి జగదీశ్ రెడ్డిని అన్యాయంగా సస్పెండ్ చేశారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ నుంచి బయటికి వచ్చి అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. ఏదైనా తప్పుగా మాట్లాడితే సభలో విచారం వ్యక్తం చేస్తామని చెప్పినప్పటికీ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారన్నారు. రేపు అన్ని నియోజకవర్గాల్లో INC దిష్టిబొమ్మలు దహనం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
News March 13, 2025
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవం

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవమైంది. మొత్తం ఐదు స్థానాల్లో కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్, సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ నామినేషన్ వేశారు. దీంతో వీరి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.