News March 13, 2025
‘సిల్లీ ఓల్డ్ ప్రోగ్రామ్స్’ను AIగా ప్రచారం చేస్తున్నారు: నారాయణ మూర్తి

దేశంలో కొన్ని కంపెనీలు ‘సిల్లీ ఓల్డ్ ప్రోగ్రామ్స్’ను AIగా ప్రచారం చేస్తున్నాయని ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అన్నారు. ప్రతి దానికీ AIతో ముడిపెడుతూ మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయిందన్నారు. ‘AIలో 2 ప్రాథమిక సూత్రాలుంటాయి. ఒకటి మెషీన్ లెర్నింగ్. ఇది ప్రిడిక్ట్ చేయడానికి లార్జ్ డేటా కావాలి. రెండోది డీప్ లెర్నింగ్. మెదడు పనితీరును అనుకరిస్తుంది. పర్యవేక్షణ లేని ఆల్గారిథమ్స్‌ను పరిష్కరిస్తుంది’అని వివరించారు.
Similar News
News March 13, 2025
అంబానీలు ఎవరో తెలియదు.. అయినా పెళ్లికి వెళ్లా: నటి

అసలు అంబానీలు ఎవరో కూడా తనకు తెలియదని, అయినా వారి ఇంట్లో పెళ్లికి హాజరయ్యానని హాలీవుడ్ నటి, మోడల్ కిమ్ కర్దాషియాన్ అన్నారు. ‘నా ఫ్రెండ్, జువెలరీ డిజైనర్ లారైన్ స్క్వార్జ్కు అంబానీలతో అనుబంధం ఉంది. ఆమె ద్వారా నాకు వారు ఆహ్వానం పంపారు. ఇన్విటేషన్ గిఫ్ట్ బాక్స్ బరువే 20 కిలోలు ఉంది. అది చూసే కచ్చితంగా పెళ్లికి వెళ్లాలని అనుకున్నా. ఇండియాకు వచ్చి అనంత్-రాధికను ఆశీర్వదించా’ అని చెప్పుకొచ్చారు.
News March 13, 2025
మాధురీ దీక్షిత్ సెకండ్ గ్రేడ్ నటి: కాంగ్రెస్ MLA

నటి మాధురీ దీక్షిత్‌పై రాజస్థాన్ INC MLA తికారామ్ జుల్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. IIFA వేడుకలపై అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ‘IIFA వల్ల రాష్ట్రానికి ఏం ఒరిగింది? ఈ కార్యక్రమం పేరిట రూ.100 కోట్ల ప్రజాధనం వృథా చేశారు. వేడుకకు వచ్చిన ఒక్కరు కూడా ఇక్కడి టూరిస్ట్ ప్లేస్‌ని విజిట్ చేయలేదు. అయినా షారుక్ తప్ప పెద్ద స్టార్లెవరూ రాలేదు. మాధురీ దీక్షిత్ సహా మిగతా వాళ్లంతా సెకండ్ గ్రేడ్ నటులే’ అని అన్నారు.
News March 13, 2025
రేపు సెలవు.. ఎల్లుండి నుంచి ఒంటిపూట బడులు

తెలుగు రాష్ట్రాల్లో ‘హోళీ’ సందర్భంగా రేపు విద్యాసంస్థలకు సెలవు ఉండనుంది. ఎల్లుండి నుంచి విద్యార్థులకు ఒంటి పూట బడులు మొదలు కానున్నాయి. ఏపీ, తెలంగాణలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు కొనసాగుతాయి. పదో తరగతి పరీక్షలు జరిగే పాఠశాలల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సా.5 గంటల వరకు నిర్వహిస్తారు. ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు ఉంటాయి. ఆ తర్వాత వేసవి సెలవులు ప్రకటించనున్నారు.