News March 13, 2025
ఖమ్మం: విషాదం.. BRS నాయకుడి కుమార్తె మృతి

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం యడవల్లిలో కొంతకాలంగా లివర్ వ్యాధితో బాధపడుతున్న BRS నాయకుడు చేరుకుపల్లి భిక్షం రెండో కుమార్తె చేరుకుపల్లి శిరీష(23) శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడి ఈరోజు మృతిచెందిందని కుటుంబసభ్యులు తెలిపారు. ఆమె మృతితో తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రులయ్యారు. గ్రామస్థులు ఆమె అకాల మరణంపై విచారం వ్యక్తం చేశారు. శిరీష మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News March 14, 2025
హోలీ పండుగ.. కోనసీమ ఎస్పీ సూచనలు

హోలీ పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావు సూచించారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ సీసీటీవీల ద్వారా హోలీ వేడుకలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్లు బహిరంగ ప్రదేశాల్లో ఇతరులపై రంగులు చల్లటం వంటి చర్యలకు పాల్పడవద్దన్నారు. హోలీలో ఎటువంటి రసాయనిక రంగులను వాడొద్దని ఎస్పీ సూచించారు.
News March 14, 2025
వికారాబాద్: హోలీ.. మార్కెట్‌లు బిజీ.. బిజీ..!

నేడు హోలీ పండుగ నేపథ్యంలో జిల్లాలోని మార్కెట్లన్నీ బిజీ.. బిజీ.. అయిపోయాయి. అధిక మోతాదులో హోలీ రంగులు కొనుగోలు చేసేందుకు తక్కువ ధరకు లభించే దుకాణాల వద్దకు ప్రజలు క్యూ కడుతున్నారు. రంగులు పిచికారీ చేసే స్ప్రేయర్లు, పిల్లల కోసం స్పెషల్‌గా రకరకాల గన్ స్ప్రేలు, బ్యాగ్ స్ప్రేలు, బుల్లెట్ స్ప్రేలు వంటివి చిన్న పిల్లల కోసం మార్కెట్‌లో లభిస్తున్నాయి.
News March 14, 2025
మిర్యాలగూడ: రోడ్డు ప్రమాదం.. వృద్ధుడి మృతి

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన మిర్యాలగూడ మండలం శ్రీనివాసనగర్‌లో జరిగింది. ఎస్ఐ వివరాలు.. నేరేడుచర్ల మండలం బక్కయ్యగూడెంకి చెందిన సైదులు(60) శ్రీనివాసనగర్‌లో జరుగుతున్న బంధువుల పెళ్లికి వచ్చాడు. తిరుగు ప్రయాణంలో కోదాడ- జడ్చర్ల రాహదారిని దాడుతున్నాడు. ఈ క్రమంలో అతణ్ని బైక్ ఢీకొంది. మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రి నుంచి నల్గొండ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.