News March 13, 2025
హోలీ పండుగ.. వరంగల్ సిటీలో పోలీసుల నజర్

హోలీ పండుగను పురస్కరించుకొని వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో పోలీసులు ప్రత్యేక బందోబస్త్ ఏర్పాటు చేయాలని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ అదేశించారు. హోలీ వేళ ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించే వారితో పాటు.. మహిళలు, యువతులపై వారి అనుమతి లేకుండా రంగులు జల్లే వారిపై పోలీసులు నజర్ పెట్టాలన్నారు. ట్రై సిటీ పరిధిలో ముమ్మరంగా పెట్రోలింగ్ చేస్తూ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
Similar News
News March 14, 2025
ఇవాళ పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ

AP: ఇవాళ పిఠాపురంలోని చిత్రాడలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ జరగనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లను ఆ పార్టీ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యవేక్షణలో పూర్తిచేశారు. పార్టీ చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మ.3 గంటలకు మంగళగిరి నుంచి బయలుదేరనున్నారు. 3.45 గంటలకు సభా స్థలికి చేరుకొని శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రాత్రికి కాకినాడలోని జేఎన్టీయూ గెస్ట్ హౌజ్‌లో బస చేస్తారు.
News March 14, 2025
ఛాంపియన్స్ ట్రోఫీ.. RECORD VIEWS

జియో హాట్‌స్టార్‌లో ప్రసారమైన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచులకు 540 కోట్లకు పైగా వ్యూస్ వచ్చినట్లు ఆ సంస్థ తెలిపింది. ఇది రికార్డు అని, ఇందులో 38 శాతం హిందీ వ్యూయర్ షిప్ ఉందని తెలిపింది. ఇక న్యూజిలాండ్, భారత్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచుకు అత్యధికంగా 124.2 కోట్ల వ్యూస్ వచ్చాయని వెల్లడించింది. జియోహాట్‌స్టార్‌లో ఒక రోజులో అత్యధిక సబ్ స్క్రైబర్స్ కూడా ఈ టోర్నీ సమయంలోనే నమోదయ్యారని పేర్కొంది.
News March 14, 2025
కడప: ఎస్సీ, బీసీలకు రూ.50 వేలు.. ఎస్టీలకు రూ.75 వేలు

జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గృహ లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంతో అసంపూర్ణంగా ఉన్న గృహాలకు ఎస్సీ, బీసీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేల చొప్పున సుమారు 25 వేల మందికి ఆర్థిక సాయం విడుదల చేస్తామన్నారు. ఈనెల 15నుంచి 23వ తేదీ వరకు సంబంధిత అధికారులు నిర్మాణాల వద్దకు వచ్చి చిత్రాలు తీసి అప్లోడ్ చేస్తారని స్పష్టంచేశారు.