News March 13, 2025
యాదాద్రి: ట్యాంకర్లతో పొలాలు తడుపుతున్నారు

భువనగిరి మండలం గౌస్‌నగర్‌లో రైతులు ట్యాంకర్ల ద్వారా పొలాలు తడుపుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోయి పంటలు ఎండిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చేతికొచ్చిన పంట ఎండిపోతోందని ట్యాంకర్ నీళ్లు కొనుగోలు చేసి పంట పొలాలను తడుపుతున్నామన్నారు. ప్రభుత్వం స్పందించి బస్వాపురం రిజర్వాయర్ నుంచి నీరు విడుదల చేసి ఆదుకోవాలన్నారు.
Similar News
News March 15, 2026
బిజినేపల్లి: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలో మెయిన్ రోడ్డుపై గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి జరిగింది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రామచంద్రయ్య(50) మెయిన్ రోడ్డుపై గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాలి.
News March 15, 2026
కొండగట్టు: ఆలయ భూమిని ఆక్రమించిన వ్యక్తిపై కేసు

కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానానికి చెందిన భూమిలో అక్రమంగా నిర్మాణాలను చేపడుతున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు మల్యాల SI నరేష్ తెలిపారు. ముత్యంపేటకు చెందిన నల్లగొండ నర్సయ్య అనే వ్యక్తి కొండగట్టు దిగువ ప్రాంతంలో సర్వేనెంబర్ 380/c నందు గల 2 గుంటల భూమిని ఆక్రమించి నిర్మాణం చేపడుతున్నట్లు ఆలయ ఈవో పోలీసులకు దరఖాస్తు ఇవ్వగా, ఆ దిశగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
News March 15, 2026
MNCL: అధికారులకు క్రీడలతో ఉపశమనం: కలెక్టర్

ప్రభుత్వ అధికారులకు క్రీడలతో పని ఒత్తిడి తగ్గి ఉపశమనం లభిస్తుందని కలెక్టర్ కుమార దీపక్ అన్నారు. రెండు రోజులుగా జరిగిన రెవెన్యూ అధికారుల క్రీడా పోటీలు ఆదివారం ముగిశాయి. విజేతలకు బహుమతులు అందజేశారు. నిత్యం బిజీగా ఉండే అధికారులకు క్రీడలు మేలు చేస్తాయన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య(స్థానిక సంస్థలు), ట్రైన్ డిప్యూటీ కలెక్టర్ విరాహత్ అలీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


