News March 13, 2025
రష్మిక సంచలనం.. రెండేళ్లలో ₹3,300 కోట్లు!

సినీ పరిశ్రమలో రష్మిక మందన్నా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారారు. యానిమల్, పుష్ప-2, ఛావా సినిమాలు భారీ కలెక్షన్లు రాబట్టడమే ఇందుకు కారణం. గత రెండేళ్లలో రష్మిక నటించిన సినిమాలు వరల్డ్ వైడ్‌గా ₹3,300 కోట్లు వసూలు చేశాయి. హిందీలోనే దాదాపు ₹1850కోట్లు రాబట్టాయి. దీంతో దీపిక, అలియా భట్ వంటి స్టార్ల కంటే రష్మికకే ఎక్కువ సక్సెస్ దక్కింది. ప్రస్తుతం ఆమె సల్మాన్ ‘సికందర్’, ధనుష్ ‘కుబేర’లో నటిస్తున్నారు.
Similar News
News March 14, 2025
ఛాంపియన్స్ ట్రోఫీ.. RECORD VIEWS

జియో హాట్‌స్టార్‌లో ప్రసారమైన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచులకు 540 కోట్లకు పైగా వ్యూస్ వచ్చినట్లు ఆ సంస్థ తెలిపింది. ఇది రికార్డు అని, ఇందులో 38 శాతం హిందీ వ్యూయర్ షిప్ ఉందని తెలిపింది. ఇక న్యూజిలాండ్, భారత్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచుకు అత్యధికంగా 124.2 కోట్ల వ్యూస్ వచ్చాయని వెల్లడించింది. జియోహాట్‌స్టార్‌లో ఒక రోజులో అత్యధిక సబ్ స్క్రైబర్స్ కూడా ఈ టోర్నీ సమయంలోనే నమోదయ్యారని పేర్కొంది.
News March 14, 2025
నేడు గ్రూప్-3 ఫలితాలు

TG: నేడు గ్రూప్-3 ఫలితాలు విడుదల కానున్నాయి. జనరల్ ర్యాంకింగ్ లిస్టును టీజీపీఎస్సీ రిలీజ్ చేయనుంది. గత ఏడాది నవంబర్ 17, 18న నిర్వహించిన గ్రూప్-3 పరీక్షలకు 2,69,483 మంది హాజరయ్యారు. దాదాపు 49.76 శాతం అభ్యర్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 1,365 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే గ్రూప్-1, 2 ఫలితాలను TGPSC ప్రకటించింది.
News March 14, 2025
తెలుగు రాష్ట్రాల ప్రజలకు సీఎంల హోలి విషెస్

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇరు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. రంగుల పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని రేవంత్ అన్నారు. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలు జరుపుకునే ఈ పండుగ సమైక్యతకు అద్దం పడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ పండగ ప్రజల జీవితాల్లో కొత్త రంగులు నింపాలని CBN ఆకాంక్షించారు. రసాయనాలతో కూడిన రంగులు ఉపయోగించవద్దని సూచించారు.