News March 13, 2025
పోలీస్ పెట్రో కార్ పనితీరుపై ఆకస్మిక తనిఖీలు చేపట్టిన సెంట్రల్ డీసీపీ

ట్రై సిటీ పరిధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీస్ పెట్రో కార్ అధికారుల పనితీరుపై సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా ఆకస్మికంగా క్షేత్ర స్థాయిలో తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా రోడ్లపై పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పెట్రో కార్ అధికారులు నిర్వహిస్తున్న పనితీరుపై అధికారులను డీసీపీ అడిగి తెలుసుకోవడంతో పాటు పెట్రోలింగ్ సమయంలో అధికారులు చేయాల్సిన విధులపై డీసీపీ పెట్రో కార్ అధికారులకు పలు సూచనలు చేశారు.
Similar News
News March 14, 2026
కడప: 10th పబ్లిక్.. ఎగ్జామ్ సెంటర్ గుర్తించండిలా.!

కడప (D)లో ఈ నెల 16 నుంచి 10th పరీక్షలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. కాగా విద్యార్థులకు ప్రభుత్వం ఓ సరికొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. పరీక్ష కేంద్రాలను గుర్తించడంలో ఇబ్బందులు లేకుండా హాల్ టికెట్‌లో QR కోడ్‌ను ముద్రించారు. దీనిని ఫోన్‌లో స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రం చిరునామా, రూట్ మ్యాప్ ఫొటోలు కనిపిస్తాయని కడప జిల్లా DEO షంషుద్దీన్ తెలిపారు. మరింత సమాచారం కోసం <<19371473>>ఇక్కడ క్లిక్ చేయండి.<<>>
News March 14, 2026
అన్నమయ్య: 10th పబ్లిక్.. ఎగ్జామ్ సెంటర్ గుర్తించండిలా.!

అన్నమయ్య (D)లో ఈ నెల 16 నుంచి 10th పరీక్షలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. కాగా విద్యార్థులకు ప్రభుత్వం ఓ సరికొత్త సౌకర్యాన్ని కల్పించింది. పరీక్ష కేంద్రాలను గుర్తించడంలో ఇబ్బందులు లేకుండా హాల్ టికెట్‌లో QR కోడ్‌ను ముద్రించారు. దీనిని ఫోన్‌లో స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రం చిరునామా, రూట్ మ్యాప్, ఫొటోలు కనిపిస్తాయని జిల్లా అధికారి శ్రీనివాసరాజు తెలిపారు. మరింత సమాచారం కోసం <<19371473>>ఇక్కడ క్లిక్<<>> చేయండి.
News March 14, 2026
మెదక్: 11న పెళ్లి చూపులు.. యువతి MISSING

మెదక్ జిల్లా పాపన్నపేటకు చెందిన సురేఖ(22) ఇస్నాపూర్‌లో అదృశ్యమైంది. తన బంధువు వికాస్ ఇంటికి వచ్చిన ఆమె, ఈ నెల 11న పెళ్లి చూపుల కోసం డ్రెస్ కొంటానని బయటకు వెళ్లి తిరిగి రాలేదు. బంధువులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పటాన్‌చెరు పోలీసులు సురేఖ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


