News March 13, 2025

వికారాబాద్: విద్యార్థుల దాతృత్వానికి సలాం..!

image

వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం సంగంకుర్దు గ్రామానికి చెందిన 9 నెలల బాలుడు వశిష్ట అరుదైన కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్సకు రూ.22లక్షల అవసరమని ఇటీవల తల్లిదండ్రులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. విషయం తెలుసుకున్న సంగంకుర్దు ప్రాథమిక పాఠశాల చిన్నారులు తమ పాకెట్ మనీని చిన్నారి వశిష్ట వైద్య చికిత్సకు అందించాలని భావించారు. వారు దాచుకున్న డబ్బులను బాధిత కుటుంబానికి ఉపాధ్యాయుల సాయంతో అందించారు.

Similar News

News April 1, 2026

డీసెట్-2026 నోటిఫికేషన్ విడుదల: DEO

image

ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణా సంస్థలలో ఇంటర్మీడియట్ అర్హతతో నిర్వహించనున్న రెండేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు డీఈవో ఆర్ బాలాజీ రావు తెలిపారు. ఇందుకు సంబంధించి https://cse.ap.gov.in, https://apdeecet.apcfss.in
వెబ్‌సైట్‌లో వివరాలు ఉన్నాయన్నారు. ఆసక్తి గలవారు గమనించాలని ఆయన కోరారు.

News April 1, 2026

ఆచంటలో ముత్యాలమ్మ ఆలయాన్ని సందర్శించిన కలెక్టర్

image

ఆచంటలోని ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ పరిసరాలను కలెక్టరు నాగరాణి, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ బుధవారం పరిశీలించారు. ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, సమీపంలో ఏర్పాటు చేయబోయే పార్కు, వాకింగ్ ట్రాక్ ప్రాంతాల్లో పచ్చదనం పెంపొందించాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే ఆచంట ప్రజలకు ఆధునిక పార్కు అందుబాటులోకి రానుందని వెల్లడించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

News April 1, 2026

MHBD: హెల్మెట్‌ ఉంటేనే గ్రామంలోకి ప్రవేశం

image

MHBD(D) బయ్యారం మండలం బాలాజీపేట గ్రామస్థులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని, లేదంటే గ్రామంలోకి అనుమతించబోమని ఏకగ్రీవంగా తీర్మానించారు. రోడ్డు ప్రమాదాల వల్ల కుటుంబాలు వీధిన పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ మాలోత్ పార్వతి తెలిపారు. ముఖ్యంగా యువతలో మార్పు రావాలని, ప్రాణ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని ఆమె కోరారు.