News March 13, 2025

లోకేశ్వర్ రెడ్డిపై దాడి టీడీపీ నేతల పనే: YCP

image

కోవెలకుంట్ల మం. కంపమల్లలో YCP <<15743280>>నేత<<>> లోకేశ్వర్ రెడ్డిపై TDP నేతలే హత్యాయత్నం చేశారని YCP ఆరోపించింది. ‘పొలంలో ఉన్న లోకేశ్వర్ రెడ్డిపై రాడ్లతో దాడి చేశారు. అతని ఇంటిపైనా దాడికి పాల్పడటంతో లోకేశ్వర్ రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి, తమ్ముడు వెంకటేశ్వర రెడ్డికి గాయాలయ్యాయి. ఇంకెన్నాళ్లు ఈ దౌర్జన్యాలు’ అంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితను ప్రశ్నిస్తూ వైసీపీ ట్వీట్ చేసింది.

Similar News

News January 17, 2026

ఖమ్మం: విషాదం.. ఆరిన ఆరు ప్రాణాలు..!

image

ఆ కుటుంబంలో గ్యాస్ ప్రమాదం రాజేసిన మంటలు.. ఏడాది తిరగకముందే అందరినీ బలితీసుకుంది. తల్లాడ(M) మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్ ఇంట్లో ఏడాది క్రితం జరిగిన సిలిండర్ పేలుడులో కవలలు, నాయనమ్మ, మేనకోడలు మృతి చెందగా.. ఆ దుఃఖాన్ని భరించలేక తల్లి రేవతి కొద్దిరోజుల క్రితమే తనువు చాలించింది. తాజాగా తండ్రి వినోద్‌ సైతం మనస్తాపంతో ఉరేసుకున్నాడు. కళ్లముందే కళకళలాడిన ఇల్లు శ్మశానవైరాగ్యాన్ని తలపిస్తుంది.

News January 17, 2026

ఇంద్రవెల్లి: మర్రి చెట్ల చెంతకు చేరిన మెస్రం వంశీయులు

image

ఈనెల 18న నిర్వహించే నాగోబా మహా పూజకు అవసరమయ్యే పవిత్ర గంగాజలంతో తిరుగు ప్రయాణమైన మెస్రం వంశీయులు కేస్లాపూర్ పొలిమేరకు చేరుకున్న విషయం తెలిసిందే. మరి చెట్టు వద్దనే ఆదివారం వరకు గడపనున్నారు. మహాపూజలకు ఉపయోగించే మట్టికుండలను సిరికొండ వెళ్లి మెస్రం వంశీయులు తీసుకొని వచ్చి ఆలయ వెనుక భాగంలో భద్రపరిచారు. ఆదివారం రాత్రి పవిత్ర గంగా జలంతో నాగోబాను అభిషేకించి జాతర ప్రారంభించనున్నట్లు ఆలయ పీఠాధిపతి తెలిపారు.

News January 17, 2026

NLG: మున్సిపాలిటీల్లో ఆధిపత్యం ఆమెదే!

image

మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలో గెలుపోటములు నిర్ణయించే కీలక భూమికను మహిళలు పోషించనున్నారు. ఇటీవల ప్రకటించిన మున్సిపాలిటీ ఓటర్ల తుది జాబితాలో పురుషులకంటే 21,014 మంది మహిళలు అధికంగా ఉన్నారు. ఇక జిల్లాలోని మెజార్టీ మున్సిపాలిటీలో మహిళా ఓటర్లే అధికంగా ఉండటం గమనార్హం. కాంగ్రెస్ మహిళలకు సంక్షేమ పథకాల పేరిట పెద్దపీట వేస్తూ ప్రచారానికి సిద్ధమవుతుండగా BRS, BJP సైతం మహిళలను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాయి.