News March 13, 2025
బీఆర్ఎస్‌కు ఇంకా అహంకారం తగ్గలేదు: సీతక్క

తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత కూడా బీఆర్ఎస్ నేతలకు ఇంకా అహంకారం తగ్గలేదని మంత్రి సీతక్క అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను నువ్వు అని సంబోధించడం వారి అహంకారానికి నిదర్శనం అన్నారు. స్పీకర్ దళితుడు కాబట్టే అగౌరవ పరుస్తున్నారని ఆరోపించారు. గవర్నర్ అంటే గౌరవం లేదని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.
Similar News
News April 19, 2026
పరిష్కార వేదిక సమయంలో మార్పులు: DRO

ఒంగోలులో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే నిర్వహిస్తామని DRO ఓబులేసు ప్రకటించారు. జిల్లాలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌కు అర్జీలు సమర్పించేవారు ఈ సమయంలోనే ఇచ్చి 12.30 గంటలకల్లా తిరిగి నివాసగృహాలకు చేరుకోవాలని సూచించారు.
News April 19, 2026
సైబర్ మోసగాళ్లపట్ల అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

జనగణన పేరుతో సైబర్ మోసగాళ్లు చేసే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అన్నారు. జనగణన సిబ్బంది అంటూ ఇంటికి వచ్చి ఫోన్, ఓటీపీలు అడిగితే చెప్పవద్దని హెచ్చరించారు. జనాభాను లెక్కించేందుకు సిబ్బంది ఫోన్ నంబర్లు, వ్యక్తిగత వివరాలు అడగరని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోరారు.
News April 19, 2026
ప్రభ్‌సిమ్రన్.. మ్యాచును మలుపు తిప్పేస్తాడు!

పంజాబ్ విజయాల్లో శ్రేయస్‌తో పాటు ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ పాత్ర ఎంతో ఉంది. బౌలర్ ఎవరనేది లెక్క చేయకుండా సిక్సర్లు, బౌండరీలతో మ్యాచును మలుపు తిప్పేయడం ఈ అన్‌క్యాప్డ్ ప్లేయర్ స్పెషాలిటీ. ఇప్పటివరకు 56 IPL మ్యాచుల్లో 1,516 రన్స్ చేశారు. 2023లో ఢిల్లీపై సెంచరీ చేశారు. స్ట్రైక్ రేట్ 154గా ఉంది. 2026 సీజన్లో 5 మ్యాచుల్లోనే 70 సగటుతో 211 రన్స్ చేశారు. తాను యువీ వద్ద ట్రైనింగ్ తీసుకున్నానని ఇటీవల చెప్పారు.


