News March 13, 2025
అనంతపురం, సత్యసాయి జిల్లా మహిళలకు ఉచిత శిక్షణ

అనంతపురం జిల్లాలో మహిళా నిరుద్యోగులకు ఉచితంగా టైలరింగ్, జర్దోషిపై ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు రూడ్ సెట్ డైరెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. ఏప్రిల్ 2 నుంచి నెలరోజులపాటు శిక్షణ ఉంటుందన్నారు. ఉచిత భోజనం, వసతి కల్పిస్తామని చెప్పారు. అనంతపురం, సత్యసాయి జిల్లాల వారు మాత్రమే అర్హులన్నారు. వివరాలకు అనంతపురంలోని కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
Similar News
News March 13, 2025
IPLకు మార్క్‌వుడ్ దూరం!

IPL టీమ్ లక్నో సూపర్ జెయింట్స్‌కు బిగ్ షాక్ తగిలింది. గాయంతో ఆ జట్టు స్టార్ పేసర్ మార్క్ వుడ్ టోర్నీకి దూరం కానున్నారు. మోకాలికి గాయం కావడంతో ఆయన సర్జరీ చేయించుకున్నారు. దీంతో 4 నెలలపాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంది. IPL మెగా వేలంలో వుడ్‌ను రూ.7.50 కోట్లు వెచ్చించి లక్నో కొనుగోలు చేసింది. కానీ ఆయన ఈ సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండడం లేదు. ఫ్రాంచైజీ ఆయన స్థానంలో మరొకరిని తీసుకునే అవకాశం ఉంది.
News March 13, 2025
నాసిరకం మద్యానికి 33 వేల మంది బలి: జీవీ

AP: YCP హయాంలో నాసిరకం మద్యం సేవించి 33 వేల మంది ప్రాణాలు కోల్పోయారని, ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అసెంబ్లీలో కోరారు. ‘జగన్ హయాంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే 10 రెట్లు ఎక్కువగా మద్యం కుంభకోణం జరిగింది. ఈ స్కామ్ ద్వారా YCP నేతలు రూ.వేల కోట్లు గడించారు. దీనిపై EDతో విచారణ చేయించాలి. దోచుకున్న సొమ్మును రికవరీ చేసి ప్రజలకు పంచాలి’ అని పేర్కొన్నారు.
News March 13, 2025
14405 టోల్ ఫ్రీపై విస్తృత ప్రచారం కల్పించాలి: కలెక్టర్

నాటు సారా సంబంధిత ఫిర్యాదులకు సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ 14405కు విస్తృత ప్రచారం కల్పించి సారారహిత జిల్లాగా పార్వతీపురం మన్యంకు గుర్తింపు తీసుకురావాలని అధికారులకు కలెక్టర్ శ్యాం ప్రసాద్ సూచించారు. గురువారం ఇందుకు సంబంధించిన గోడ పత్రిక, కరపత్రాలను ఆయన విడుదల చేశారు. పోలీసులు నాటు సారా గ్రామాలను దత్తత తీసుకోవాలని అన్నారు. పోలీసులు, ఎక్సైజ్ అధికారులు సమన్వయంగా విస్తృత దాడులు చేయాలని ఆదేశించారు.