News March 13, 2025
అనకాపల్లి: రేపు జడ్పీ స్థాయి సంఘం సమావేశాలు

ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ స్థాయి సంఘాల సమావేశాలు ఈనెల 15వ తేదీన నిర్వహించనున్నట్లు సీఈఓ నారాయణమూర్తి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.జడ్పీ చైర్పర్సన్ సుభద్ర అధ్యక్షతన సమావేశాలు జరుగుతాయన్నారు.విశాఖ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటల నుంచి స్థాయి సంఘాల సమావేశాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.జడ్పిటిసిలు, ఎంపీపీలు జిల్లా స్థాయి అధికారులు సమావేశానికి హాజరుకావాలని కోరారు.
Similar News
News March 19, 2026
పోలీసులు.. పొలిటికల్ కనుసన్నల్లోనే(3/3)

పసిపిల్లల విక్రయాలు స్థానిక పోలీసులకు తెలిసే జరుగుతున్నాయని వాదన వినిపిస్తోంది. అదేవిధంగా విక్రయాలు చేసే గ్యాంగ్ ప్రధాన సూత్రధారి నియోజకవర్గ నేత పక్కనే ఉంటూ ఫోటోలకు ఫోజులిస్తూ కనిపించడం ఈ వాదనకు బలం చేకూరుస్తుంది. పోలీసులు నిందితులను గుర్తించినా విడిచిపెడుతున్నారనే వాదన బలంగా ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర స్థాయిలో ఈ గ్యాంగ్ అరాచకాలపై దృష్టి సారించకుంటే ఈ గ్యాంగ్ అరాచకాలకు భారీ మూల్యం చెల్లించక తప్పదు.
News March 19, 2026
MBNR: ఉగాది సుఖ సంతోషాలు నింపాలి: SP

తెలుగు నూతన సంవత్సర ఉగాది(పరాభవ నామ సంవత్సర) పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ జానకి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఆశలు, కొత్త ఆకాంక్షలతో మొదలయ్యే ఈ తెలుగు నూతన సంవత్సరం, ప్రజలందరి జీవితాలలో శాంతి, సుఖ సంతోషాలను నింపాలని ఆమె ఆకాంక్షించారు. ఉగాది తెలుగు ప్రజలకు నూతన సంవత్సర ఆరంభమని పేర్కొంటూ, పోలీస్ సిబ్బంది, మీడియా, జిల్లా ప్రజలకు ఆరోగ్యం, ఆనందం కలగాలని ఎస్పీ జానకి పేర్కొన్నారు.
News March 19, 2026
విద్యార్థుల చేతిరాతపై ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు!

AP: విద్యార్థుల చేతిరాత బాగాలేదనే కారణంతో మార్కులు తగ్గించవద్దని ఇంటర్ బోర్డు స్పష్టంచేసింది. సమాధానాల ఆధారంగానే మూల్యాంకనం చేయాలని జూ.లెక్చరర్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. ‘పూర్తిగా చదవకుండానే మార్కులు ఇవ్వొద్దు. ఆన్సర్స్ సరిగ్గా ఉంటే చేతిరాత కారణంగా మార్కులు తగ్గించవద్దు’ అని సూచించింది. పొరపాట్లు వస్తే ₹3వేలు-7500 వరకు జరిమానా ఉంటుందని హెచ్చరించింది. ఈ నెల 21 నుంచి మూల్యాంకనం మొదలు కానుంది.


