News March 13, 2025

పోతారు.. మొత్తం పోతారు: యూఎన్ చీఫ్ హెచ్చరిక

image

దేశాలు వాణిజ్య యుద్ధాల్లోకి దిగడం ఎవరికీ మంచిది కాదని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్ హెచ్చరించారు. సుంకాల పోరు అన్ని దేశాలనూ దెబ్బ కొడుతుందని పేర్కొన్నారు. ‘మనం నేటికాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బతుకుతున్నాం. అన్ని దేశాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. స్వేచ్ఛాయుత వాణిజ్యం అందరికీ ఉపయోగం. అదే వాణిజ్య యుద్ధంలోకి వెళ్తే విజేతలెవరూ ఉండరు’ అని స్పష్టం చేశారు.

Similar News

News March 26, 2026

పొట్టేళ్లకు ఎండు మేత చాలా ముఖ్యం

image

పొట్టేళ్ల పెంపకంలో పచ్చి మేత కంటే ఎండు మేతే చాలా ముఖ్యమని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. వేరుశనగ పొట్టు, ఉలవ పొట్టు, కంది పొట్టు వంటి చాలా రకాల ఎండు మేతలు అందుబాటులో ఉన్నాయి. వీటిని పొట్టేళ్లు చాలా ఇష్టంగా తింటాయి. దీని వల్ల అవి చాలా ఆరోగ్యంగా ఉంటూ, ఎక్కువ బరువు పెరుగుతాయి. అందుకే పచ్చిమేత కాస్త తక్కువైనా, ఎండు మేతను వెటర్నరీ నిపుణుల సూచనలతో సరైన పరిమాణంలో అందేలా చూసుకోవాలి.

News March 26, 2026

రోజూ కాసేపు హాయిగా నవ్వితే..

image

నవ్వు బెస్ట్ మెడిసిన్ అంటున్నారు వైద్యులు. రోజూ కాసేపు మనస్ఫూర్తిగా నవ్వితే ఫిజికల్, మెంటల్ టెన్షన్లు, ఒత్తిడి, కోపం తగ్గుతాయంటున్నారు. ‘10-15ని.లు నవ్వితే 40 క్యాలరీలు ఖర్చవుతాయి. ఫీల్ గుడ్ హార్మోన్లయిన ఎండార్ఫిన్‌లు విడుదలవుతాయి. రోగనిరోధక శక్తి, రక్త నాళాల పనితీరు మెరుగుపడుతుంది. గుండె సమస్యలు, BP తగ్గుతాయి. క్యాన్సర్‌పై పోరాటంలోనూ సాయపడుతుంది’ అని పేర్కొంటున్నారు.
#ShareIt

News March 26, 2026

BREAKING: పెరిగిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.220 పెరిగి రూ.1,46,890కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.200 పెరిగి రూ.1,34,650 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ రేటు రూ.2.60 లక్షలుగా ఉంది.