News March 13, 2025
హోలీ పండుగ.. MHBD జిల్లా ప్రజలకు ఎస్పీ కీలక సూచన

హోలీ పండుగను సురక్షితంగా, బాధ్యతగా జరుపుకోవాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ సూచించారు. హోలీ పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు పోలీస్ శాఖ తరఫున పలు సూచనలు చేశారు. చర్మానికి, పర్యావరణానికి హానికరం కానీ సహజ రంగులను ఉపయోగించాలన్నారు. మద్యపానం సేవించి వాహనాలను నడపద్దని ప్రజా స్థలాల్లో మర్యాదగా వ్యవహరించి ప్రశాంతమైన పండుగను జరుపుకోవాలని అన్నారు.
Similar News
News March 20, 2026
కడప జిల్లాలో 10th ఇంగ్లిష్ పరీక్ష వాయిదా.!

రాష్ట్ర ప్రభుత్వం శనివారం రంజాన్ సందర్భంగా సెలవు ప్రకటించింది. దీంతో ఆ రోజున జరగవలసిన పదవ తరగతి ఇంగ్లిష్ పరీక్షను ప్రభుత్వం వాయిదా వేసింది. ఏప్రిల్ 2న ఇంగ్లిష్ పరీక్షను నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇంగ్లిష్ పరీక్ష వాయిదాను గమనించాలని పేర్కొంది.
News March 20, 2026
కాకినాడ: సినిమా చూసి వస్తూ యువకుడు మృతి

గండేపల్లి మండలం రామయ్య పాలెంలో గురువారం విషాదం చోటుచేసుకుంది. సినిమా చూసి బైక్‌పై వస్తున్న చందు, మణికంఠ, కిషోర్‌లను ఆటోను తప్పించే క్రమంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంలో చందు అక్కడికక్కడే మృతి చెందగా, మణికంఠ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో మృతుడి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 20, 2026
GNT: రూ. లక్షకు రూ.2 లక్షలు లాభమని భారీ మోసం

గుంటూరుకు చెందిన అన్నం పూర్ణచంద్రరావు కొంతమందితో కలిసి నవ్య వారాహి ప్రైవేట్ లిమిటెడ్, ట్రేడ్ దోస్త్ పేర్లతో అరండల్ పేటలో ఆఫీస్ ఏర్పాటు చేశాడు. పెట్టుబడిదారులకు రూ. లక్ష పెట్టుబడికి, రూ.2 లక్షలు లాభం ఇస్తానని, డ్రా ద్వారా 40 గ్రాముల బంగారం ఇస్తానని డబ్బులు వసూలు చేశాడు. వాటిని తీసుకుని ఈ నెల 14న పరారయ్యాడు. బాధితురాలు చింతా శివ కోటేశ్వరి ఫిర్యాదుతో అరండల్ పేట పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టామన్నారు.


