News March 13, 2025
స్పీకర్ అలా వ్యవహరించకపోతే అవిశ్వాసం పెడతాం: హరీశ్ రావు

TG: స్పీకర్ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించకపోతే ఆయనపై అవిశ్వాస తీర్మానం పెడతామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు హెచ్చరించారు. ‘సభ మీ ఒక్కరిది కాదు అందరిదీ అని జగదీశ్ రెడ్డి అన్నారు. “నీ” అన్న మాట ఆయన అనలేదు. “మీ” అనే పదం సభ నిబంధనలకు విరుద్ధమేమీ కాదు. మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు నిరసనలు చేశారో, సభను ఎందుకు వాయిదా వేశారో తెలీదు’ అని పేర్కొన్నారు.
Similar News
News November 9, 2025
రేవంత్ సర్టిఫికెట్ నాకు అవసరం లేదు: కిషన్ రెడ్డి

TG: BJP, BRS కలిసిపోయాయని రేవంత్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారంలో మాట్లాడుతూ ‘రేవంత్ వ్యక్తిగత విమర్శలకు దిగినా భయపడను. రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఆయన సర్టిఫికెట్ నాకు అవసరం లేదు. రాష్ట్ర అభివృద్ధికి BJP ఏం చేసిందో నాకు తెలుసు. రూ.లక్ష కోట్ల అవినీతిని బయట పెడతామని రాహుల్, రేవంత్ చెప్పి రూ.లక్ష కూడా వెలికితీయలేదు’ అని ఎద్దేవా చేశారు.
News November 8, 2025
ఆసీస్‌తో అయిపోయింది.. సౌతాఫ్రికాతో మొదలవుతుంది

ఆస్ట్రేలియాలో టీమ్ ఇండియా టూర్ నేటితో ముగిసింది. రేపు ఆటగాళ్లు స్వదేశానికి రానున్నారు. ఈనెల 14(కోల్‌కతా) నుంచి సౌతాఫ్రికాతో 2 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. 22న(గువాహటి)లో సెకండ్ టెస్ట్ జరగనుంది. తర్వాత 3 వన్డేల సిరీస్ మొదలవుతుంది. 30న తొలి, DEC 3న రెండో, 6న మూడో వన్డే ఆడతారు. అనంతరం 5 టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. 9న తొలి, 11న రెండో, 14న మూడో, 17న నాలుగో, 19న ఐదో టీ20 జరుగుతుంది.
News November 8, 2025
కొత్తగా CDF పోస్టు… పాక్ ఆర్మీలో కీలక మార్పు!

ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ రక్షణ వ్యవహారాల్లో పలు మార్పులు వస్తున్నాయి. భారత CDS మాదిరిగా కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్(CDF) పేరిట కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసి ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్సుల బాధ్యత అప్పగిస్తారని ‘GEONEWS’ పేర్కొంది. సైన్యంపై అధికారం అధ్యక్షుడు, ప్రభుత్వానికి కాకుండా CDFకు ఉంటుందని తెలిపింది. త్వరలో రిటైర్ కానున్న ఆర్మీ చీఫ్ మునీర్ రేసులో ఉన్నారని వెల్లడించింది.


