News March 13, 2025
మంత్రి అచ్చెన్నాయుడుపై కేసు కొట్టివేత

ఓబులాపురం మైనింగ్‌పై గతంలో టీడీపీ నేతలు చేసిన ఆందోళనలకు సంబంధించిన కేసును విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో విచారణ ఎదుర్కొన్న అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, చినరాజప్ప, ధూళిపాళ్ల నరేంద్ర, జనార్దన్ రెడ్డి సహా పలువురు నేతలు ఈ కేసు నుంచి విముక్తి పొందారు. గురువారం ఉదయం విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు వద్దకు టీడీపీ శ్రేణులు చేరుకున్నారు.
Similar News
News March 14, 2025
టెక్కలి: ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు

టెక్కలి మండలం పెద్దసాన ప్రాథమికోన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఒక ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీచేశారు. పాఠశాలలో విద్యార్థినీల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో వారి ఫిర్యాదు మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి విచారణ చేపట్టి ఆయనను సస్పెండ్ చేశారు. కాగా ఈ ఆరోపణలు ఉన్న ఉపాధ్యాయుడు గతంలో కూడా ఒకసారి సస్పెన్షన్‌కు గురయ్యారు.
News March 14, 2025
ఎచెర్ల: 6వ సెమిస్టర్ పరీక్ష ఫీజు చెల్లించుటకు గడువు పెంపు

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో గల డిగ్రీ ఆరవ సెమిస్టర్ internship పరీక్ష ఫీజులను చెల్లించుటకు మార్చి 25వ తేదీ వరకు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా పొడిగించామని యూనివర్సిటీ డీన్ జి.పద్మారావు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఇంటర్నషిప్ వైవ ఏప్రిల్ 1వ తేదీ నుంచి 4 వ తేదీ వరకు ఉంటాయని తెలియజేశారు.
News March 13, 2025
పలాస: రేపు ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం రద్దు

ప్రతి శుక్రవారం కాశీబుగ్గ పోలీసు స్టేషన్ ఆవరణంలో నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదులు స్వీకరణ హోలీ పండగ నేపథ్యంలో రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాశీబుగ్గ పరిసర ప్రాంత ప్రజలు పై విషయాన్ని గమనించి ప్రజా ఫిర్యాదులు స్వీకరణ కార్యక్రమానికి రావద్దని కోరారు.