News March 13, 2025
మా వల్లే కాంగ్రెస్ ఉచిత కరెంట్ ఇచ్చింది: సీఎం

AP: ఉమ్మడి ఏపీలో విపక్షాలు తనను ప్రపంచ బ్యాంక్ జీతగాడు అని విమర్శించాయని, కానీ ప్రజల కోసం భరించానని సీఎం చంద్రబాబు చెప్పారు. ‘నేను 1995లో తొలిసారి సీఎం అయినప్పుడు రోజుకు 10-15 గంటలే కరెంటు ఉండేది. దేశంలో తొలిసారిగా విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చాం. 2003లో కరెంట్ కోతలు లేని రాష్ట్రంగా ఏపీని మార్చాం. మేము తెచ్చిన సంస్కరణల వల్లే కాంగ్రెస్ ఉచిత కరెంట్ ఇవ్వగలిగింది’ అని అసెంబ్లీలో సీఎం చెప్పారు.
Similar News
News March 13, 2025
‘XXX’ సబ్బుల కంపెనీ అధినేత మృతి

AP: ‘XXX’ సబ్బుల కంపెనీ అధినేత మాణిక్కవేల్ అరుణాచలం మరణించారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుంటూరు అరండల్ పేటలోని స్వగృహంలో మృతి చెందారు. తమిళనాడుకు చెందిన అరుణాచలం గుంటూరులో స్థిరపడ్డారు. ఇక్కడి నుంచే సబ్బుల వ్యాపారం మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు. తెలుగు రాష్ట్రాల్లో XXX సోప్, ఈ బ్రాండ్ ఇతర ఉత్పత్తుల ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
News March 13, 2025
ఉద్యోగుల మధ్య జీతాల తేడాలొద్దు: నారాయణ మూర్తి

ఉద్యోగుల మధ్య జీతాల తేడా ఉండకూడదని, వారిని మనుషుల్లాగా చూడాలని ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి అన్నారు. తక్కువ, ఎక్కువ వేతన వ్యత్యాసాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని ‘టై కాన్ ముంబై 2025’ ఈవెంట్‌లో అభిప్రాయపడ్డారు. ‘ప్రతి ఉద్యోగి గౌరవం, హుందాతనాన్ని కాపాడాలి. వారిని ప్రశంసించేటప్పుడు బహిరంగంగా, మందలించేటప్పుడు ఏకాంతంగా చెప్పాలి. కంపెనీ లాభాలను ఉద్యోగులందరికీ సమానంగా అందించాలి’ అని పేర్కొన్నారు.
News March 13, 2025
హోళీ రంగులు పోవాలంటే ఇలా చేయండి

– బయటకు వెళ్లే ముందు పెట్రోలియం జెల్లీ లేదా నూనె రాసుకుంటే లేయర్‌లా కాపాడుతుంది
– రంగులు పడ్డాక వీలైనంత త్వరగా నీటితో కడుక్కోండి
– చేతికి హానికర కెమికల్ కలర్స్ అంటితే సీ సాల్ట్, గ్లిజరిన్, ఆల్మండ్ ఆయిల్‌తో రుద్దండి
– రంగులు చల్లుకున్నాక నేరుగా షాంపూతో తలను శుభ్రం చేయకుండా ముందుగా నీళ్లతో కడగండి
– పెరుగు, నిమ్మరసం కలిపి రంగులు బాగా అంటిన చోట రుద్ది గోరువెచ్చని నీటితో స్నానం చేయండి