News March 13, 2025
నిర్మల్ జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ

నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పండుగను సంతోషాల నడుమ జరుపుకోవాలని కోరారు. సహజ రంగులను వాడాలని సూచించారు. బైక్‌లపై వేగంగా వెళ్లవద్దని, యువత ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు.
Similar News
News March 13, 2025
రూపాయి గుర్తు ఎలా రూపొందించారంటే..

దివంగత ఆర్థిక మంత్రి ప్రణబ్ 2009 కేంద్ర బడ్జెట్ సమయంలో రూపాయికి గుర్తు సూచించాలని ఓపెన్ కాంపిటిషన్ ప్రకటించారు. 3331 డిజైన్లలో 5 షార్ట్ లిస్ట్ చేసి DMK మాజీ MLA కుమారుడు, ప్రొఫెసర్ ఉదయ్ పంపినది ఎంపిక చేశారు. ఇది దేవనాగరి లిపి र “ra”, లాటిన్ ఇంగ్లిష్‌లో నిలువు గీత లేని Rను పోలి ఉంటుంది. ₹లో 2 సమాన అడ్డగీతలు అసమానతల్లేని సంపద పంపిణీని సూచిస్తాయి.
PS: గతంలో Rs, Re, రూ. అని భిన్న రూపాయి సూచకాలుండేవి.
News March 13, 2025
అక్కడి మహిళలు 10 మందిని పెళ్లి చేసుకునే సంప్రదాయం: మంత్రి

ఉత్తర భారతంలో ఒక స్త్రీ 10మందిని వివాహం చేసుకునే సంప్రదాయం ఉందని తమిళనాడు మంత్రి మురుగన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అదే దక్షిణ భారతంలో అటువంటి కల్చర్ లేదన్నారు. జనాభా నియంత్రణ విధానాన్ని పక్కాగా అమలు చేయడంతో ఇక్కడి జనాభా తగ్గిందని, కానీ నార్త్ ఇండియాలో ఒకరు 10మందికి పైగా పిల్లల్ని కన్నారన్నారు. తమిళ సంస్కృతిని హేళన చేసేలా ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే వారి నాలుక చీరేస్తానని మంత్రి హెచ్చరించారు.
News March 13, 2025
మంత్రులతో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు

రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్‌తో విజయనగరం ఉమ్మడి జిల్లా తెదేపా ఎమ్మెల్యేలు ఎస్ కోట ఎమ్మెల్యే లలిత కుమారి, బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన, కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరి, చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకట్రావు, విజయనగరం ఎమ్మెల్యే అతిధి గజపతిరాజు, పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర తదితరులు అసెంబ్లీ లాబీలో గురువారం కలుసుకున్నారు.