News March 13, 2025

రేపు హోళీ.. ములుగు ఎస్పీ వార్నింగ్!

image

హోలీ పండుగను సురక్షితంగా, బాధ్యతతో జరుపుకోవాలని ములుగు ఎస్పీ శబరిశ్ తెలిపారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇతరులపై బలవంతంగా రంగులు వేయకుండా, పరస్పర గౌరవంతో పండుగా జరుపుకోవాలన్నారు. బలవంతంగా రంగులు పూయడం, శారీరక, మానసిక వేధింపులకు గురి చేయడం నేరమన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదకరమని, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 సంప్రదించాలని కోరారు. శాంతి భద్రతలకు భంగం కలిగించొద్దన్నారు.

Similar News

News March 13, 2025

సీఎంఆర్ చెల్లించకుంటే కఠిన చర్యలు: అ.కలెక్టర్

image

వికారాబాద్: సీఎంఆర్ బియ్యాన్ని మిల్లర్లు సకాలంలో అందించాలని, చెల్లించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ తెలిపారు. గురువారం వికారాబాద్ కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో రైస్ మిల్లర్, పౌరసరఫరాల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఖరీఫ్ 2024-25కు సంబంధించిన సివిల్ సప్లై ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వానికి చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు.

News March 13, 2025

హోలీని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి: CP

image

హోలీ పండుగను సంప్రదాయ పద్ధతుల్లో, సహజ సిద్ధమైన రంగులతో జరుపుకోవాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ తెలిపారు. శాంతియుతంగా వేడుకలు జరుపుకోవాలన్నారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపరాదని, లోతట్టు ప్రదేశాల్లో, చెరువుల్లో ప్రాజెక్టులలో స్నానాలు చేయునప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు చెప్పారు.

News March 13, 2025

విశాఖ: హాల్ టికెట్ల పేరుతో విద్యార్థులను వేధిస్తే కఠిన చర్యలు

image

ఫీజులు పెండింగ్‌లో ఉన్నాయన్న నెపంతో పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లకు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని విశాఖకు చెందిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం అన్నారు. స్కూల్ యాజమాన్యాలు ఫీజులపై ఈ సమయంలో ఒత్తిడిని పెంచడం సమంజసం కాదన్నారు. ఆన్లైన్లో హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకుని విద్యార్థులు పరీక్షలు రాయవచ్చన్నారు.

error: Content is protected !!