News March 13, 2025
WGL: క్రమంగా తగ్గుతున్న మొక్కజొన్న ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మొక్కజొన్న ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. మంగళవారం మక్కలు (బిల్టి) క్వింటాకు రూ.2,310 ధర పలకగా.. బుధవారం రూ.2,305కి చేరింది. ఈరోజు మళ్లీ రూ.10 తగ్గి రూ.2,300కి పడిపోయింది. అలాగే సూక పల్లికాయ క్వింటాకి రూ.7,150 పలికినట్లు వ్యాపారులు తెలిపారు. మార్కెట్లో క్రయ విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.
Similar News
News March 27, 2026
IPL 2026 ఓపెనింగ్ సెరిమనీ రద్దు!

ఈ ఏడాది IPL ఓపెనింగ్ సెరిమనీ ఉండదు. గతేడాది జూన్ 4న బెంగళూరు స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన వారికి గుర్తుగా ఈసారి వేడుకలు నిర్వహించొద్దని BCCI నిర్ణయించింది. అందుకే శనివారం జరిగే ఫస్ట్ మ్యాచ్ ముందు ఎలాంటి సెలబ్రేషన్స్ చేయట్లేదు. అయితే మే 31న జరిగే ఫైనల్ రోజు మాత్రం గ్రాండ్ క్లోజింగ్ సెరిమనీ ప్లాన్ చేస్తున్నారు.
News March 27, 2026
పెద్దపల్లి: మే 11 నుంచి జనగణన 2027 ప్రారంభం: కలెక్టర్

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష జనగణన 2027 హౌస్ లిస్టింగ్ సమీక్ష నిర్వహించారు. ప్రతి కుటుంబం తప్పనిసరిగా నిజమైన సమాచారం అందించాలని, తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని తెలిపారు. సిబ్బందికి డేటా సేకరణ, డిజిటల్ పరికరాల వినియోగం, ఫీల్డ్ జాగ్రత్తలపై శిక్షణ ఇచ్చారు. జనగణన మే 11 నుంచి ప్రారంభమై భవిష్యత్ సంక్షేమ, అభివృద్ధి పథకాల కోసం ఖచ్చిత గణాంకాలు సిద్ధం చేస్తుందని పేర్కొన్నారు.