News March 13, 2025
నంద్యాల: బొలెరోతో ఢీకొట్టి.. చోరీ

బేతంచర్లకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి జస్వంత్ నంద్యాలలో బైక్ను కొనుగోలు చేసి బేతంచర్లకు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో తమ్మరాజు పల్లె ఘాట్ వద్ద దుండగులు జస్వంత్ బైకును బొలెరోతో ఢీ కొట్టారు. జస్వంత్ కిందపడిపోగా అతని చేతికి ఉన్న 4 తులాల బ్రేస్లెట్, 2 ఉంగరాలను బొలెరోలో వచ్చిన ముగ్గురు దొంగలు దోచుకున్నారు. ఘటనపై పాణ్యం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 14, 2025
విశాఖ జూలో చిరుత మృతి.. కారణమిదే..!

విశాఖ జూ పార్క్లో 2008 నుంచి ఉంటున్న ‘సుధ’ అనే ఆడ చిరుతపులి గురువారం సాయంత్రం మృతి చెందినట్లు జూక్యూరేటర్ మంగమ్మ వెల్లడించారు. 20 సంవత్సరాల వయసు కలిగిన ఈ చిరుత మయోకార్డియల్ ఇన్ఫార్జన్ డిసీజ్ కారణంగా మృతి చెందినట్లు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ వెల్లడించారన్నారు. దీని సగటు జీవిత కాలం 12 నుంచి 15 సంవత్సరాలు కాగా జూ సంరక్షణలో ఉండడంతో 20 సంవత్సరాలు జీవించిందన్నారు.
News March 14, 2025
సంక్షేమ కార్యక్రమాల అమలులో వివక్ష ఉండదు: CM

AP: టీడీపీ నాయకులు ఏ స్థాయిలోనూ వైసీపీ నేతలతో సంబంధాలు పెట్టుకోకూడదని సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. తాను ఇలా చెబితే.. వైసీపీకి ఓటేసిన వారికి పథకాలు ఇవ్వొద్దన్నట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో వివక్ష ఉండదని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలు వేరు, రాజకీయ సంబంధాలు వేరని వ్యాఖ్యానించారు.
News March 14, 2025
ఏప్రిల్ 9 నుంచి 1-9వ తరగతి ఎగ్జామ్స్

TG: రాష్ట్రంలో 1-9వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు (సమ్మేటివ్ అసెస్మెంట్-2) ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 17న పరీక్షలు ముగుస్తాయని, అనంతరం జవాబుపత్రాలను మూల్యాంకనం చేసి అదే నెల 23న ఫలితాలు వెల్లడించాలని విద్యాశాఖ నిర్ణయించింది. తల్లిదండ్రుల సమావేశాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు ప్రోగ్రెస్ రిపోర్టులు అందించాలని ఆదేశించింది.