News March 13, 2025
నల్గొండ: పోలీస్ శాఖకు టీం స్పిరిట్ చాలాముఖ్యం: కలెక్టర్

పోలీస్ శాఖకు టీంస్పిరిట్ చాలా ముఖ్యమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్‌ను గురువారం ఎస్పీ శరత్ చంద్ర పవర్‌తో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోలీస్ ఉద్యోగం ఒత్తిడితో చేసే ఉద్యోగమని.. శారీరక స్ఫూర్తితో పాటు మానసికంగా అలర్ట్ కావడానికి క్రీడలు ఉపయోగపడతాయన్నారు.
Similar News
News July 4, 2025
నల్గొండ: మేధో సంపత్తి హక్కులపై ఒకరోజు అవగాహన

IPR సెల్ MGU నల్గొండ, శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ, TG స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ ఆధ్వర్యంలో విద్యార్థులకు మేధో సంపత్తి హక్కులపై ఒకరోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడారు. విద్యార్థులు వినూత్న ఆలోచన, ఆచరణాత్మక దృక్పథానికి, క్రమశిక్షణ తోడైతే ప్రతి ఒక్కరూ శాస్త్రవేత్తలుగా ఎదిగి పేటెంట్ సాధించడం సులువు అని అన్నారు.
News July 4, 2025
నల్గొండ: ‘బీఏఎస్ విద్యార్థులపై వివక్ష తగదు’

బెస్ట్ అవైలబుల్ స్కీం విద్యార్థులపై ఆల్ఫా స్కూల్ యాజమాన్యం వివక్షతకు పాల్పడుతోందని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున ఆరోపించారు. శుక్రవారం పేరెంట్స్‌తో కలిసి నల్గొండ ఆల్ఫా పబ్లిక్ స్కూల్ ముందు ధర్నా నిర్వహించారు. ప్రైవేట్ స్కూల్‌లో దళిత విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలనే ప్రభుత్వ లక్ష్యం నీరుగారిందని, బుక్స్ ఇవ్వకుండా విద్యార్థులను ఒంటరిగా కూర్చోబెడుతున్నారన్నారు.
News July 4, 2025
NLG: ‘కొమురయ్య పోరాట పటిమ ఆదర్శప్రాయం’

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య వర్ధంతిని సీపీఎం నేతలు నల్గొండ పట్టణంలోని దొడ్డి కొమురయ్య భవనంలో శుక్రవారం నిర్వహించారు. కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడారు. ఆయన పోరాట పటిమ అందరికీ ఆదర్శప్రాయమన్నారు. భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ఆయన జరిపిన పోరాటం స్ఫూర్తిదాయకమని కొనియాడారు.