News March 13, 2025

KMR: హోలీని సురక్షితంగా జరుపుకోవాలి: SP

image

కామారెడ్డి జిల్లా ప్రజలు హోలీ పండుగను సురక్షితంగా, ఆనందంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర కోరారు. గురువారం ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగించేలా మద్యం మత్తులో వాహనాలు నడుపోద్దన్నారు. చెర్వుల్లో, కుంటల్లో లోతైన నీటిలోకి వెళ్లి ప్రమాదబారిన పడవద్దని సూచించారు. సురక్షితమైన రంగులను వాడి హోలీ జరుపుకోవాలన్నారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు.

Similar News

News April 10, 2026

రాక్రీట్ సంస్థపై పోలీసుల విచారణ

image

మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డికి చెందిన రాక్రీట్ సంస్థపై నమోదైన కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. విజయవాడ శివారులో ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టు పొందిన ఈ సంస్థ, పనులు చేయకుండానే తప్పుడు బిల్లులతో నిధులు స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందిన నిధుల వివరాలను గృహ నిర్మాణ శాఖ అధికారులు పోలీసులకు వెల్లడించారు. కీలక పత్రాల కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు.

News April 10, 2026

KNR: అదే రీతి.. ఉద్యోగుల్లో ఆగని అవినీతి

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ శాఖల్లో అవినీతి హెచ్చు మీరుతోంది. వివిధ శాఖల అధికారులు ఏసీబీకి పట్టుబడుతున్న తీరే ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. గురువారం అంతర్గాం ఆర్ఐ శ్రీమాన్ ఏసీబీకి చిక్కిన సంగతి తెలిసిందే. ప్రజలకు అందించే సేవలకు ప్రభుత్వం వేతనం ఇస్తున్నా అదనపు ఆదాయానికి రుచి మరిగి కొందరు అధికారులు, ఉద్యోగులు లంచావతారమెత్తి ప్రజలను జలగల్లా పీడిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏసీబీకి చిక్కుతున్నారు.

News April 10, 2026

సీనియర్ T-20 గుంటూరు జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక

image

ఈ నెల 11 నుంచి 14 వరకు మూలపాడులో నిర్వహించనున్న ACA సీనియర్ T-20 మెన్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ పోటీలకు గుంటూరు జిల్లా సీనియర్ జట్టు ఎంపికైంది. క్రీడాకారులు షేక్‌ రషీద్(C), మహీప్, వంశీకృష్ణ(WC), అఖిల్, సిద్దార్థ్, ప్రణయ్ కుమార్, సమన్విత్, షేక్‌ అస్లాం బేగ్, రేవంత్ కుమార్, సిద్దు కార్తీక్ రెడ్డి, ఆకాశ్, షేక్.తౌఫిక్, మనోహర్, జయచంద్రకేశవ్, షేక్.బాజీ ఎంపికయ్యారు. మరో ఆరుగురు స్టాండ్ బైస్ ఉన్నారు.