News March 13, 2025

ఎన్టీఆర్: నేటితో ముగియనున్న ఉద్యోగాల దరఖాస్తు గడువు

image

ఏపీ సీఆర్డీఏలో కాంట్రాక్ట్ పద్ధతిన 22 ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా పలు విభాగాలలో డైరెక్టర్లు, మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నట్లు సీఆర్డీఏ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు https://crda.ap.gov.in/ వెబ్‌సైట్‌లో గురువారంలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Similar News

News March 25, 2026

మార్కాపురం జిల్లా గ్యాస్ గోదాముల్లో పోలీసుల తనిఖీలు

image

మార్కాపురం జిల్లా ఇన్‌ఛార్జ్ SP హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు జిల్లాలోని త్రిపురాంతకం, వెలిగండ్ల, కనిగిరి, టీవీపల్లి, రాచర్ల, సియస్‌పురం పోలీస్ స్టేషన్ల పరిధిలో గ్యాస్ గోదాములను మంగళవారం తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో సంబంధిత రెవెన్యూ అధికారులు, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్యాస్ గోదాముల్లో అమలు చేస్తున్న భద్రతా చర్యలు, అగ్నిమాపక సదుపాయాలు, తగినంత నీటి వసతిని పరిశీలించారు.

News March 25, 2026

భద్రాద్రి నవమి వేడుకలకు 2 వేల మందితో బందోబస్తు

image

భద్రాద్రి శ్రీరామనవమి వేడుకల నేపథ్యంలో భక్తుల భద్రత కోసం 2 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఉత్సవాల పర్వదినాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన ఆంక్షలు అమలు చేస్తున్నామన్నారు. భక్తులు, స్థానిక ప్రజలు పోలీసు నిబంధనలకు సహకరించి వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. ఎక్కడా అసౌకర్యం కలగకుండా పార్కింగ్, క్యూలైన్ల వద్ద ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు.