News March 13, 2025
పార్వతీపురం జిల్లాకు మొదటి స్థానం తీసుకురావాలి: కలెక్టర్

పదో తరగతి పరీక్షల్లో రాష్ట్రంలోనే పార్వతీపురం మన్యం జిల్లాకు మొదటి స్థానం వచ్చేలా కృషి చేయాలని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ అన్నారు. గురువారం పార్వతీపురం డివియం ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని పేర్కొన్నారు.
Similar News
News March 16, 2026
సిద్దిపేట: మెనూ అమలు చేయాలి: కలెక్టర్

గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో మెనూ ఖచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ కే.హైమవతి ఆదేశించారు. సోమవారం జరిగిన సమీక్షలో.. బీసీ వెల్ఫేర్ హాస్టల్ అపరిశుభ్రతపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారిని సస్పెండ్ చేయాలని, వాచ్‌మెన్, వంట మనిషిని విధుల నుంచి తొలగించాలని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News March 16, 2026
డ్రగ్స్ సప్లై నెట్‌వర్క్ గుట్టు విప్పే పనిలో పోలీసులు

TG: రాజకీయ, వ్యాపార ప్రముఖులు పట్టుబడ్డ మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసు దర్యాప్తు పోలీసులకు సవాలుగా మారింది. ఈ వ్యవహారం వెనుక ఉన్న డ్రగ్స్ సప్లై నెట్‌వర్క్‌పై వారు దృష్టి పెట్టారు. వాటిని ఎక్కడినుంచి ఎవరు తెచ్చారనే దానిపై ఆరా తీస్తున్నారు. ఢిల్లీ వ్యాపారవేత్త గాలిలోకి కాల్పులు జరపడంపై CCTV ఫుటేజ్, ఖాళీ తూటాలను పోలీసులు సేకరించారు. ఈకేసులో నార్కోటిక్ అనాలసిస్ టెస్టులో ఐదుగురికి పాజిటివ్ అని తేలింది.
News March 16, 2026
NTR: ఆ పంచాయతీల్లో RR యాక్ట్ అమలాయ్యేనా..?

పంచాయతీ నిధుల దుర్వినియోగంపై NTR కలెక్టర్ లక్ష్మీశ కఠిన చర్యలు చేపట్టారు. పెనుగంచిప్రోలు, ముత్యాల, కంచికచర్ల, రామవరప్పాడు సర్పంచులు, అధికారులు రూ. కోట్లలో నిధులు పక్కదారి పట్టించడంతో రికవరీకి ‘రెవెన్యూ రికవరీ’ యాక్ట్ ప్రయోగించారు. అయితే నిందితులు రాజకీయ పలుకుబడితో తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. నిధుల రికవరీ ప్రక్రియ ఇప్పుడు కలెక్టర్‌కు సవాలుగా మారింది.


