News March 13, 2025

అసెంబ్లీ: బీఆర్ఎస్‌ఎల్పీలో ఉద్రిక్తత

image

తెలంగాణ అసెంబ్లీలో హైడ్రామా కొనసాగుతోంది. తనపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేయడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి వెళ్లి బీఆర్ఎస్‌ఎల్పీలోని కేసీఆర్ ఛాంబర్‌లో కూర్చున్నారు. అయితే ఆయన వద్దకు వెళ్లిన మార్షల్స్ అసెంబ్లీ నుంచి బయటికి వెళ్లాలని సూచించారు. దీంతో జగదీశ్, కేటీఆర్, హరీశ్, తలసాని వారితో వాగ్వాదానికి దిగారు. ప్రతిపక్ష నేత ఛాంబర్‌లో కూర్చుంటే అభ్యంతరమేంటని ప్రశ్నించారు.

Similar News

News March 28, 2026

చెన్నైకి బిగ్ షాక్.. 2 వారాలు ధోనీ దూరం

image

ఇవాళ్టి నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుండగా CSKకు బిగ్ షాక్ తగిలింది. కండరాల గాయంతో బాధపడుతున్న మాజీ కెప్టెన్ ధోనీ మొదటి 2 వారాలు మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు ఫ్రాంచైజీ వెల్లడించింది. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారని తెలిపింది.

News March 28, 2026

యుద్ధంలోకి యెమెన్ హౌతీలు.. ఇజ్రాయెల్‌పై మిస్సైల్ దాడి

image

ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు పశ్చిమాసియా యుద్ధంలోకి దిగారు. ఇవాళ యెమెన్ నుంచి ఇజ్రాయెల్‌పైకి బాలిస్టిక్ మిస్సైల్‌ను లాంచ్ చేశారు. దాన్ని విజయవంతంగా అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించింది. ఎవరికీ గాయాలు కాలేదంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హౌతీల మొదటి దాడి ఇదే. కాగా ఇరాన్‌కు వ్యతిరేకంగా US, ఇజ్రాయెల్‌ యుద్ధంలోకి ఎవరైనా వస్తే తామూ రణరంగంలోకి దిగుతామని హౌతీలు నిన్న ప్రకటించారు.

News March 28, 2026

రాత్రి ఫోన్ చేసి ఇన్నర్‌వేర్‌పై ప్రొఫెసర్ ప్రశ్నలు!

image

చెన్నైలోని అన్నా వర్సిటీ ప్రొఫెసర్ జ్ఞానవేల్‌పై ఒక విద్యార్థిని సంచలన ఫిర్యాదు చేశారు. ఇంటర్న్‌షిప్ ఇప్పిస్తానని దగ్గరై తనను వేధించాడని బాధితురాలు ఆరోపించారు. రాత్రి వేళల్లో ఫోన్ చేసి ఇన్నర్‌వేర్, పీరియడ్స్, పెళ్లి వంటి పర్సనల్ విషయాలపై అసభ్యంగా మాట్లాడుతూ టార్చర్ పెట్టేవాడని తెలిపారు. నంబర్ బ్లాక్ చేసినా ఇతర మార్గాల్లో వేధించాడని పేర్కొన్నారు. పోలీసులు అతణ్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.