News March 13, 2025
బాపట్ల: ఆర్టీసీ బస్సుల్లో టెన్త్ విద్యార్థులకు ఫ్రీ జర్నీ

ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బాపట్ల జిల్లా విద్యా శాఖ అధికారి శ్రీరామ్ పురుషోత్తం తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 16,799 (8482 విద్యార్థులు, విద్యార్థినిలు 8317) మంది 103 పరీక్ష కేంద్రాలలో పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థికి హాల్ టికెట్‌పై ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు.
Similar News
News March 15, 2025
పవన్ స్పీచ్‌కు మంత్రముగ్ధుడినయ్యా: చిరంజీవి

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జయకేతనం సభలో ప్రసంగానికి మంత్రముగ్ధుడినయ్యానని మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించారు. సభకు వచ్చిన జనసంద్రంలాగే తన మనసు ఉప్పొంగిందని ట్వీట్ చేశారు. ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే నాయకుడొచ్చాడన్న నమ్మకం మరింత బలపడిందన్నారు. ప్రజా సంక్షేమం కోసం ఉద్యమస్ఫూర్తితో పవన్ జైత్రయాత్ర నిర్విఘ్నంగా కొనసాగాలని మెగాస్టార్ ఆశీర్వదించారు.
News March 15, 2025
ఇతర మతాలవారిని తిట్టగలరా?: పవన్ కళ్యాణ్

AP: తనను సనాతన ధర్మం రక్షకుడని ఓ ఆంగ్ల జర్నలిస్టు ఎద్దేవా చేశారంటూ Dy.CM పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ‘మా రాముడి విగ్రహం తల నరికేస్తే మా మనోభావాలు గాయపడకూడదా? నోరు మూసుకుని కూర్చోవాలా? మీరు అల్లానో, జీసస్‌నో, మేరీమాతనో అవమానించి బతకగలరా? కానీ లక్ష్మీ దేవిని, సరస్వతి దేవిని అవమానిస్తారు. రథాల్ని తగులబెట్టేస్తారు. తప్పును తప్పని చెబితే మతోన్మాదమా?’ అని ప్రశ్నించారు.
News March 15, 2025
పవన్ ప్రసంగంపై అంబటి సెటైర్

AP: జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగంపై వైసీపీ నేత అంబటి రాంబాబు సెటైరికల్ ట్వీట్ చేశారు. ‘జయకేతనంలో ఏమి చెప్పాలనుకున్నాడో ఏమి చెప్పాడో పాపం పవన్ కళ్యాణ్’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.