News March 13, 2025
కామారెడ్డి: 316 మంది గైర్హాజరు

కామారెడ్డి జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. గురువారం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ గణితం 1బి, జంతు శాస్త్రం, చరిత్ర పరీక్ష జరిగింది. జనరల్ గ్రూప్‌కు సంబంధించి 7130 మంది పరీక్ష రాయాల్సి ఉండగా.. 6915 మంది పరీక్ష రాశారు. ఒకేషనల్ విభాగంలో 1293 మంది పరీక్ష రాయాల్సి ఉండగా, 101 మంది పరీక్షకు దూరంగా ఉన్నారని కామారెడ్డి జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు.
Similar News
News March 14, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా: హోలీ వేడుకల్లో జిల్లా కలెక్టర్

రాజన్న సిరిసిల్ల జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హోలీ వేడుకల్లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పాల్గొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో జరిగిన హోలీ సంబరాలలో బీజేపీ అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, బీజేపీ కార్యకర్తలతో జిల్లా కలెక్టర్ రంగులు చల్లుకొని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
News March 14, 2025
విశాఖ జూలో చిరుత మృతి.. కారణమిదే..!

విశాఖ జూ పార్క్‌లో 2008 నుంచి ఉంటున్న ‘సుధ’ అనే ఆడ చిరుతపులి గురువారం సాయంత్రం మృతి చెందినట్లు జూక్యూరేటర్ మంగమ్మ వెల్లడించారు. 20 సంవత్సరాల వయసు కలిగిన ఈ చిరుత మయోకార్డియల్ ఇన్‌ఫార్జన్ డిసీజ్ కారణంగా మృతి చెందినట్లు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ వెల్లడించారన్నారు. దీని సగటు జీవిత కాలం 12 నుంచి 15 సంవత్సరాలు కాగా జూ సంరక్షణలో ఉండడంతో 20 సంవత్సరాలు జీవించిందన్నారు.
News March 14, 2025
సంక్షేమ కార్యక్రమాల అమలులో వివక్ష ఉండదు: CM

AP: టీడీపీ నాయకులు ఏ స్థాయిలోనూ వైసీపీ నేతలతో సంబంధాలు పెట్టుకోకూడదని సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. తాను ఇలా చెబితే.. వైసీపీకి ఓటేసిన వారికి పథకాలు ఇవ్వొద్దన్నట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో వివక్ష ఉండదని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలు వేరు, రాజకీయ సంబంధాలు వేరని వ్యాఖ్యానించారు.