News March 13, 2025
నరసరావుపేట: బియ్యం పంపిణీ తనిఖీ చేసిన జేసీ

నరసరావుపేట చౌక ధరల ద్వారా జరుగుచున్న బియ్యం పంపిణీని జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గనోరే ఆకస్మిక తనిఖీ చేశారు. బియ్యం పంపిణీ వాహనాన్ని తనిఖీ చేశారు. స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు ఎం.యు.డి బియ్యం పంపిణీ దారులతో మాట్లాడారు. బియ్యం పంపిణీ సక్రమంగా జరుగుతున్నది లేనిది అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్డీవో మధులత, తాహశీల్దార్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 20, 2026
సిరిసిల్ల: 4 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది

యాసంగి సీజన్‌లో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో యాసంగి సీజన్ కొనుగోళ్లపై అధికారులు,రైస్ మిల్లర్లు,ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సుమారు జిల్లాలో 2,70,000 నుంచి 3 లక్షల మెట్రిక్ నెల ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మొత్తం 240 కొనుగోలు కేంద్రాలు ఉంటాయన్నారు.
News March 20, 2026
రూ.5.62 లక్షల కోట్లకు చేరువగా రుణభారం!

తెలంగాణలో అప్పులు గణనీయంగా పెరుగుతున్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంపై రుణభారం రూ.5.62 లక్షల కోట్లకు చేరుకుంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. 2025-26లో రుణభారం రూ.5.03 లక్షల కోట్లు కాగా ఇప్పుడు అదనంగా మరో రూ.59,000 కోట్లు పెరగనుంది. రుణభారం ఈ విధంగా పెరగడం వల్ల, ఈ ఏడాది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి రుణాలు సేకరించే విషయంలో ప్రభుత్వానికి ఆటంకాలు తప్పేలా లేవు.
News March 20, 2026
ఆయిల్ పామ్ సాగుతో రైతు ఆదాయం రెట్టింపు: రాఘవరెడ్డి

ఆయిల్ పామ్ సాగు ద్వారా రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని ఆయిల్ ఫెడ్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి తెలిపారు. వరి, పత్తి, మిర్చి పొలాల్లో కూడా దీనిని సాగు చేయవచ్చని, రవాణా ఖర్చులను ప్రభుత్వమే భరించి మూడు రోజుల్లోనే నగదు జమ చేస్తుందని వెల్లడించారు. రైతు మహోత్సవంలో భాగంగా ఉత్తమ సాగుదారులుగా నిలిచిన రైతులను ఆయన సత్కరించారు. ఆధునిక సాగు పరికరాలపై అవగాహన పెంచుకోవాలని రైతులకు సూచించారు.


