News March 13, 2025
LSGకి గుడ్‌న్యూస్.. మిచెల్ మార్ష్‌కు లైన్ క్లియర్

వెన్నెముక గాయంతో ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ మార్ష్ IPLలో ఆడనున్నట్లు తెలుస్తోంది. మెడికల్ టీమ్ నుంచి ఆయనకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు క్రిక్ఇన్ఫో తెలిపింది. ‘బౌలింగ్ చేయకుండా, ఫీల్డింగ్‌లో ఒత్తిడి పడకుండా చూడాలన్న వైద్యుల సూచన మేరకు మార్ష్ కేవలం బ్యాటర్‌గా, ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడే అవకాశం ఉంది’ అని పేర్కొంది. ఆయనను వేలంలో LSG దక్కించుకుంది.
Similar News
News November 8, 2025
ఆండ్రాయిడ్ ఓల్డ్ వెర్షన్ యూజర్లకు BIG ALERT

దేశంలో ఆండ్రాయిడ్ యూజర్లకు కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(CERT-In) హెచ్చరికలు జారీ చేసింది. ఆండ్రాయిడ్ 13, 14, 15, 16 వెర్షన్ల(ఫోన్స్, ట్యాబ్లెట్స్)లో సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని, ఇవి హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపింది. శామ్సంగ్, వన్‌ప్లస్, షియోమీ, రియల్మీ, మోటోరోలా, వివో, ఒప్పో, గూగుల్ పిక్సల్ ఫోన్లపై ప్రభావం ఉంటుందని పేర్కొంది. వెంటనే వెర్షన్‌ను అప్డేట్ చేసుకోవాలని సూచించింది.
News November 8, 2025
ఆయిల్ ఫామ్ రైతులకు మేలు చేస్తున్న కీటకం

ఆయిల్ పామ్ సాగులో పరాగసంపర్కం కీలకం. దీనిపైనే పంట దిగుబడి ఆధారపడి ఉంటుంది. ఈ పంటలో గాలి ద్వారా సంపర్కం సాధ్యం కాదు. అందుకే జగిత్యాల రైతులు ఆయిల్ పామ్ పంటల్లో పరాగసంపర్కం కోసం ఆఫ్రికన్ వీవిల్ అనే కీటకాన్ని వినియోగిస్తున్నారు. చాలా చిన్నగా ఉండే ఈ కీటకం పరాగ సంపర్కానికి కీలక వాహకంగా పనిచేస్తూ దిగుబడి పెరిగేందుకు సహకరిస్తోంది. దీని వల్ల దిగుబడులు గణనీయంగా పెరిగాయని జగిత్యాల రైతులు చెబుతున్నారు.
News November 8, 2025
BELలో ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<


