News March 13, 2025
ఖమ్మం: రేపు మద్యం దుకాణాలు, బార్లు బంద్: సీపీ

హోలీ పండుగ సందర్భంగా ఈనెల 14న (శుక్రవారం) మద్యం విక్రయాలపై నిషేదం విధిస్తూ పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాలు జారీ చేశారు. కమిషనరేట్ పరిధిలోని కల్లు దుకాణాలు, వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లలో శుక్రవారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం అమ్మకాలు నిలిపివేయాలని సూచించారు. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Similar News
News December 28, 2025
మామునూర్ ఎయిర్‌పోర్టుకు గ్రీన్ సిగ్నల్!

వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టు పునరుద్ధరణ పనులు వేగంగా సాగుతున్నాయి.శనివారం ఏఏఐ HYD జీఎం బీవీ రావు బృందానికి 223 ఎకరాల ప్రైవేట్ భూమిని అధికారులు అప్పగించారు. గతంలోనే 696.14 ఎకరాలు ఉండగా, మొత్తం 950 ఎకరాల భూసేకరణ తుది దశకు చేరింది. జనవరిలో PM మోదీ, CM రేవంత్ రెడ్డితో భూమి పూజ చేసి పనులు ప్రారంభించనున్నారు. 2027 చివరి నాటికి విమాన సేవలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది TGలో రెండో ఎయిర్‌పోర్టుగా మారనుంది.
News December 28, 2025
ఖమ్మం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద రోడ్డు ప్రమాదం

ఖమ్మం నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరిలో, వెనుక కూర్చున్న మహిళ ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఆమె కాళ్లపై నుంచి దూసుకెళ్లింది. దీంతో ఆమె కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. క్షతగాత్రురాలిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆమె వివరాలు తెలియాల్సి ఉంది.
News December 28, 2025
చలి మంట.. పసిపిల్లలు మృతి

చలి కాచుకోవడానికి గదిలో బొగ్గుల కుంపటి పెట్టుకుని నిద్రించిన నలుగురు ఊపిరాడక చనిపోయిన ఘటన బిహార్‌లోని ఛాప్రాలో జరిగింది. మృతుల్లో ముగ్గురు పసిపిల్లలు, ఒక వృద్ధురాలు ఉన్నారు. గది తలుపులన్నీ మూసి ఉండటంతో బొగ్గుల నుంచి వచ్చిన కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ గదిని నింపేసింది. దీంతో ఆ గాలి పీల్చి వారు స్పృహ కోల్పోయి ప్రాణాలు విడిచినట్లు డాక్టర్లు తేల్చారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.


