News March 13, 2025
సిరిసిల్ల :ఎస్పీని కలిసిన బీఆర్ఎస్ నేతలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మహేష్ బి గీతేను బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోటా ఆగయ్య నేడు మర్యాదపూర్వకంగా కలిశారు. పూల మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చక్రపాణి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్, నాయకులు లక్ష్మీనారాయణ, మురళి, శ్రీనివాస్, సర్దార్ ఉన్నారు.
Similar News
News March 24, 2026
నిబంధనల మేరకే గ్యాస్ సరఫరా జరగాలి: కలెక్టర్

గ్యాస్ సరఫరాలో నిబంధనలు ఉల్లంఘిస్తే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా హెచ్చరించారు. సీతారాంపూర్‌లోని భారత్ గ్యాస్ గోదామును ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి, గృహ వినియోగదారులకు గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
News March 24, 2026
నిర్మల్ : ఈనెల 28న జిల్లాస్థాయి పోటీలు

2026-27 విద్యా సంవత్సరానికి రాష్ట్ర క్రీడా పాఠశాలల్లో 4వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఎంపికలు 3దశల్లో జరుగుతాయనీ, మండల స్థాయిలో ఎంపికైన విద్యార్థులు మార్చి 28న నిర్మల్‌లో జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ పోటీలు ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహిస్తున్నామన్నారు.
News March 24, 2026
భూసేకరణ అడ్డంకులను త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్

జిల్లాలో జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా చేపట్టిన భూసేకరణకు సంబంధించి దరఖాస్తుల పరిష్కారం పనులను వేగవంతం చేయాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఆర్డీవో కార్యాలయాన్ని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రావుతో కలిసి సందర్శించి దరఖాస్తుల పరిష్కారం వివరాలను పరిశీలించారు. 63, 163జీ రహదారుల ఏర్పాటులో దరఖాస్తుల పరిష్కార చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.


